బీజేపీ ‘మైక్రో డొనేషన్స్’ ప్రారంభించిన బండి సంజయ్

-

బీజేపీ పార్టీ ‘మైక్రో డొనేషన్స్’ ప్రారంభించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. భారత దేశ వ్యాప్తంగా ప్రజల నుండి ‘మైక్రో డొనేషన్స్’ పేరిట చిన్న మొత్తాలను విరాళాలుగా సేకరించనుంది భారతీయ జనతా పార్టీ. ఫిబ్రవరి 11 వరకు ఈ విరాళల సేకరణ జరుగనుంది. ‘మైక్రో డొనేషన్స్’ బాధ్యతను మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పార్టీ రాష్ట్ర కోశాధికారి భండారి శాంతికుమార్, రాష్ట్ర మాజీ కార్యదర్శి పాపారావులకు అప్పగించింది తెలంగాణ బీజేపీ పార్టీ.

విరాళాలుగా కేవలం చిన్న మొత్తాలు మాత్రమే తీసుకోనుంది. రూ. 5 నుండి మొదలుకుని రూ.50, రూ.100, రూ.500, రూ.వెయ్యి వరకు మాత్రమే విరాళాలు తీసుకోనున్నారు. ఒక వ్యక్తి ఒకసారి మాత్రమే విరాళం ఇవ్వాలనే రూల్‌ పెట్టింది. రెండోసారి ఇవ్వాలనుకున్నా అది సాధ్య పడదు. విరాళాలు ఇవ్వదల్చుకున్న వారు తప్పనిసరిగా ‘NAMO APP’ ద్వారానే చెల్లించాలని బీజేపీ పార్టీ నేతలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news