రెండు రోజుల్లో తెలంగాణలో కరోనా తగ్గుముఖం : మంత్రి హరీష్‌ రావు

-

మరో రెండు, మూడు రోజుల్లోనే తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడతాయని మంత్రి హరీశ్ రావు ప్రకటన చేశారు. కరోనా సెకండ్ వేవ్ లో 500 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్ అవసరం పడిందని… కాని 200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే అందుబాటులో ఉందని తెలిపారు‌. మిగతా 300 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ తమిళనాడు, గోవా రాష్ట్రాల నుండి తెప్పించుకోవడానికి నానా కష్టాలు పడ్డామన్నారు. ఈ పరిస్థితి గమనించి‌సీఎం 500 మెట్రిక్ టన్నులకు ఆక్సిజన్ ఉత్పత్తి పెంచాలని ఆదేశించామని చెప్పారు.

ప్రస్తుతం‌ 300 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి కి చేరుకున్నామని.. మరో2౦౦ మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తికి పాశమైలారంలో ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు అగ్రిమెంట్ చేసుకున్నామని స్పష్టం చేశారు. త్వరలో ఇది ప్రారంభమవుతుందని.. రాష్ట్రంలో 27 వేల పడకలు ఉంటే ప్రతీ పడకకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించామన్నారు. జ్వర సర్వే మంచి ఫలితాలు ఇస్తోందని.. కరోనా అలసత్వం వద్దు. అందరం మాస్క్ ధరిద్దాం, వాక్సిన్ వేయించుకుందామని స్పష్టం చేశారు. దేశంలో పేదలకు ఉత్తమ వైద్య సేవలు అందించే విషయంలో తెలంగాణ మూడో స్థానంలో ఉందన్న ఆయన తొలి స్థానంలో నిలవాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news