రాష్ట్రాలకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తీపికబురు చెప్పారు. రాష్ట్రాల కోసం రూ. లక్ష కోట్ల నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన చేశారు మంత్రి నిర్మలా సీతారామన్. రాష్ట్రాలకు ఆర్థిక సాయంగా రూ. లక్ష కోట్ల నిధి ఏర్పాటు చేస్తున్నామని.. ఈ ప్రత్యేక నిధి ద్వారా అన్ని రాష్ట్రాలకు రూ. లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు ఇస్తామని చెప్పారు.
పీఎం గతిశక్తి పథకం ద్వారా మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్… వచ్చే మూడేళ్లలో కొత్తగా 400 వందే భారత్ రైళ్లు ప్రవేశపెడుతున్నామన్నారు. భారత్‌లో అవసరాలకు అనుగుణంగా మెట్రో రైలు కనెక్టివిటీ జరుగుతోందని వెల్లడించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్… రవాణ రంగంలో మౌలిక సదుపాయాల కోసం రూ.20 వేల కోట్టు కేటాయించామని స్పష్టం చేశారు. వచ్చే ఐదేళ్లలో 13 లక్షల కోట్ల ఉత్పత్తి ఆధారిత ఇన్సెంటివ్‌లు అందిస్తున్నామని.. చిన్న, మధ్యతరహా రైతుల కోసం వన్‌నేషన్ వన్‌ప్రొడక్ట్ పథకం అమలు చేస్తున్నామని చెప్పారు నిర్మలా సీతారామన్.