మొసళ్లు మంజీరా డ్యాం ఆవరణలోని పర్యావరణ విద్యా కేంద్రం వన్యప్రాణి అభయారణ్యంలోని మొసళ్ల ప్రత్యుత్పత్తి కేంద్రంలో పదుల సంఖ్యలో సందడి చేస్తున్నాయి. ఇక్కడ మూడు పెద్ద మొసళ్లు ఉండగా, యాభైకి పైగా చిన్న చిన్న మొసళ్లు ఉన్నాయి. మధ్యాహ్నం సమయంలో ఎండకు వచ్చి సేద తీరుతున్నాయి. కొలనులో ఉన్న నీటిలో, కొలను బయట అటూ ఇటూ తిరుగుతూ పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి.