దళితులకు కేసీఆర్‌ శుభవార్త..దళితబంధుకు రూ. 20 వేల కోట్లు !

-

కేంద్ర ప్రభుత్వం యూనియన్‌ బడ్జెట్‌ రెండు రోజుల కిందట ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలోనే.. తెలంగాణ రాష్ట్రం కూడా త్వరలోనే బడ్జెట్‌ ను ప్రవేశ పెట్టనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఆర్థిక శాఖ ప్రముఖులు. పన్ను ఆదాయం అంచనాలను చేరుకుంటున్న వేళ.. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ తెలంగాణ బడ్జెట్‌ భారీగానే ఉండే అవకాశం కనిపిస్తోంది. డిసెంబర్‌ నెలాఖరు వరకు పన్ను అంచనాలను 70 శాతం చేరుకుంది.

ఈ ఏడాది లక్షా 50 వేల కోట్ల వ్యయం చేస్తామంటోన్న సర్కార్‌.. వచ్చే ఏడాదికి మరో 30 వేల కోట్ల పెరుగుతుందని చెబుతోంది. సంక్షేమానికి సింహ భాగం కేటాయింపులతో పాటు వ్యవసాయం, నీటి పారుదల, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత దక్కనుంది. దళిత బంధు పథకానికి ఏకంగా రూ.20 వేల కోట్లు కేటాయించే అవకాశం ఉంది. దళితులకు ఎలాగైనా.. దళిత బంధు పథకాన్ని అమలు చేసేందుకే.. ఈ స్థాయిలో డబ్బులు కేటాయించాలని సర్కార్‌ యోచిస్తోంది. కాగా.. హుజురాబాద్‌ ఎన్నికల సమయంలో దళిత బంధును కేసీఆర్‌ సర్కార్‌ తీసుకువచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news