నేటి ‘చలో విజయవాడ’..వందల సంఖ్యలో ఉద్యోగులు అరెస్ట్‌

-

విజయవాడ : ఏపీ సర్కార్‌ ప్రకటించిన పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు నిర్వహించ తలపెట్టిన చలో విజయవాడ పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ కార్యక్రమం నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ఆంక్షలు విధించారు.ఛలో విజయవాడకు వస్తున్న ఉద్యోగులను ఎక్కడిక్కకడే అడ్డుకుంటున్నారు పోలీసులు. ఎన్జీవో హోం సమీపంలో ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. శ్రీకాకుళం నుంచి బస్సులో వస్తోన్న ఉద్యోగులను అడ్డగిస్తున్నారు.

అదే బస్సులో పెదవేగి పోలీసి గ్రౌండ్సుకు తరలిస్తున్నారు. ఇలా వందల సంఖ్యలో ఉద్యోగులను పోలీసులు అరెస్ట్‌ చేస్తున్నారు. పీఆర్సీ సాధన సమితి నాయకులను గృహ నిర్భంధం చేస్తున్నారు. మరోవైపు చలో విజయవాడకు అనుమతి లేదని.. కాదని వెళ్తే ప్రభుత్వం తీసుకునే చర్యలకు బాధ్యులు అవుతారంటూ ఉద్యోగులు, ఉపాధ్యాయులను హెచ్చరిస్తూ.. పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. అత్య వసర వైద్య కారణాలైతే తప్ప ఉద్యోగులు, ఉపాధ్యాయులకు గురువారం సెలవులు ఇవ్వొద్దని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news