ఏపీ ఉద్యోగులకు షాక్..సమ్మెకు ఆర్టీసీ ఉద్యోగులు దూరం !

-

పీఆర్సీ సాధన సమితికి మద్దతుగా‌ ఆర్టీసీ సంఘాలు సమ్మె చేస్తామనడం కరెక్ట్ కాదని.. ఆ ఉద్యోగుల పీఆర్సీకి మా ఆర్టీసీ పీఆర్సీకి సంబంధం లేదని ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ మల్లిఖార్జున రెడ్డి పేర్కొన్నారు. ఆర్టీసీని నష్టాల్లోంచి బయటకు తేవాలని సీఎం జగన్ కష్టపడుతున్నారని.. గతంలో ఆర్టీసీలో ఉద్యోగులకు, సిబ్బందికి జీతాలివ్వాలంటే ఏదో ఒకటి తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి ఉందన్నారు.

పాదయాత్రలో సీఎం జగన్ యూనియన్లకు ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు… ఆర్టీసీలో అప్పులు కట్టుకోండి మీ నుంచి ప్రభుత్వానికి డబ్బులు వద్దని సీఎం చెప్పారని గుర్తు చేశారు. ప్రభుత్వమే ఆర్టీసీలోని వారికి జీతాలు చెల్లిస్తోందని.. రూ. 4,800 కోట్ల అప్పు ఇంకా ఆర్టీసీకి ఉందని చెప్పారు.

కోవిడ్ నష్టం ఆర్టీసీని మరింత అప్పుల్లోకి నెట్టింది… తెలంగాణా ఆర్టీసీలో ఉద్యోగస్తులు, సిబ్బందికి సకాలంలో జీతాలు పడేవి కావన్నారు.ఆర్టీసీ సంఘాలు మరోసారి పునః పరిశీలించుకోవాలని.. ఆర్టీసీ సంఘాలు సమ్మె కు వెళ్తే ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఆలోచిస్తామని ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ మల్లిఖార్జున రెడ్డి ప్రకటన చేశారు. సమస్యలుంటే సీఎం వద్ద చర్చించి పరిష్కరించుకుందామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news