ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ యువ నాయకులు నారా లోకేష్ బహిరంగ లేఖ రాశారు. ఉద్యోగులపై ఎందుకింత క్రూరత్వం అంటూ లేఖలో ఫైర్ అయ్యారు. వారికి న్యాయంగా రావాల్సిన ప్రయోజనాల కోసం శాంతియుతంగా నిరసన తెలియజేయడం నేరమా అని నిలదీశారు. విద్యాబుద్దులు నేర్పే గురువులను పోలీసులతో నిర్బంధించడమేనా.. వారికి ఇచ్చే గౌరవం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వంలో ఉద్యోగులు భాగం అంటూనే… సలహాదారులు, తాబేదార్లు, పోలీసులతో మాటలు, విష ప్రచారాలు, దాడులు చేస్తూ మానసికంగా అలాగే శారీరకంగా హింసిస్తున్నారని సీఎం జగన్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఇదేం రాక్షస ప్రవృత్తి అంటూ సీఎం జగన్ ను నిలదీశారు. వారంలో సిపిఎస్ ను రద్దు చేస్తామని చెప్పి ఇప్పుడు అవగాహన లేక అలా చెప్పమంటూ మడమ తిప్పని మండిపడ్డారు నారా లోకేష్. ఇప్పటికైనా ఉద్యోగులతో చర్చలు జరిపి వారి డిమాండ్లను పరిష్కరించాలని లేఖ ద్వారా డిమాండ్ చేశారు నారా లోకేష్. లేకపోతే ఉద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పదు అన్నారు.