బ్యూటీ స్పీక్స్ : ఒక రాధ కోసం..

-

బాలీవుడ్ లో పొడుగు కాళ్ల సుంద‌రి
దీపిక పదుకోనే
టాలీవుడ్ లో పొడుగు కాళ్ల సుంద‌రి
పూజా హెగ్డే  
ఇద్ద‌రికీ క‌న్న‌డ మూలాలు ఉన్నాయి. ఆ విధంగా ఇద్ద‌రూ రెండు సినిమా ప్ర‌పంచాల‌ను ఏలేందుకు యువ రాణులుగా వ‌స్తున్నారు. దీపికా క‌న్నా సౌత్ లో పూజా బేబీనే క్రేజ్ ఎక్కువ తెచ్చుంది. టాలెంట్ క‌న్నా అందం క‌న్నా అదృష్ట సంఖ్య‌లు కొన్ని సార్లు బాగా ప‌నిచేస్తాయి..ఆ విధంగా ప్ర‌భాస్ అదృష్ట సంఖ్యకు జ‌త అయింది పూజా హెగ్డే.. ఆ విధంగా రాధే శ్యామ్ క‌థ‌తో ఎవ‌రి జాతకం ఏంట‌న్న‌ది తేలిపోనుంది.

ప్రేమ ఎలా ఉన్నా పూజా బేబీ చెప్పాక ఆ క‌థ‌కు ఆ సినిమాకు వేల్యూ ఒక్క‌సారిగా పెరిగిపోతుంది. అల వైకుంఠ పురం తో అప్పుడు,అంతుకుముందు అర‌వింద స‌మేత రాఘ‌వ‌తో ఇంకొంత కాలం త‌న హ‌వాతో ఫిదా చేసింది. అందం ఒక్క‌టే కాదు అభినయ ప్రాధాన్యం ఉన్న పాత్ర‌ల్లో హీరోయిన్లు రాణించాలి. అక్కినేని చిన్నోడితో అలానే చేసింది. కాస్తంటే కాస్త ప‌రిణితితో ఉన్న క్యారెక్ట‌ర్ అది. మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్ తో మంచి హిట్ ఒక‌టి కొట్టేసి యువ హీరోల‌కూ తానే బెస్ట్ ఛాయిస్ అని చెప్పింది.

ఈ సినిమా త‌రువాత కూడా పూజ మ‌రికొన్ని సినిమా సంగ‌తులు వినిపించే ప్ర‌యత్నం ఒక‌టి చేస్తూనే ఉంది. త్వ‌ర‌లో మార్చి 11న రాధే శ్యామ్ తో సంద‌డి చేయ‌నుంది. ఈ క‌థ‌కు చాలా గొప్ప సున్నిత భావాలున్నాయి. వాటిని నిల‌బెట్టే ప్ర‌య‌త్నంలో పూజాబేబీ ఎంత మేరకు ప్ల‌స్ అయింది. లేదా మైన‌స్ అయింది అన్న‌ది తెలుసుకోవాలి అంటే ప్ర‌భాస్ అభిమానుల‌తో పాటు మ‌నం కూడా ఆ రోజు కోసం రాధే శ్యామ్ రిలీజ్ కోసం వేచిచూడాల్సిందే!

కొత్త సినిమాల క‌బుర్లలో రాధే శ్యామ్ పేరు వినిపిస్తోంది. కొత్త సినిమా అన‌గానే కొత్త ప్రేమ క‌థ ఒక‌టి నీటిపై తేలుతుంది. నింగిపై మెరుస్తుంది. నేల‌పై విక‌సించి ప‌రిమ‌ళం అందిస్తుంది. అవును గాలులు మోసుకు వ‌చ్చే ఊసుల్లో కొత్త సినిమా ఊసులు కూడా ఉంటాయి.ఆ విధంగా కొత్త ప్రేమ క‌థ‌లో పూజా బేబీ ఉంటోంది. కొత్త ఇల్లు క‌ట్టుకున్న ఆనందంతో పాటు కొత్త క‌థ‌ను వినిపించాల‌న్న ఆనందం కూడా ఆమెకు ఉంది. ఆనందం మ‌రియు ఆత్రం క‌లిసి కొత్త సినిమాకు ఓ హైప్ తెచ్చేసింది ఆ పొడుగు కాళ్ల సుంద‌రి.

హీరోయిన్ల‌లో పూజాబేబీ మాత్ర‌మే ప్ర‌త్యేకం. ఊరు క‌ర్ణాట‌క.. ఇంటి పేరు హెగ్డే కానీ పిల్ల ముంబ‌యిలో ఇల్లు కొని స్థిర‌ప‌డిపోవాల‌న్న నిర్ణ‌యం ఒక‌టి చేసింది. ఆ విధంగా ఇప్పుడు పూజాబేబీ సొంత ఇంటి సంద‌డితో పాటు కొత్త సినిమాల సంగ‌తుల్లో కూడా నెట్టింట్లో హ‌ల్ చల్ చేస్తోంది. త్వర‌లోవిడుద‌ల‌కు సిద్ధం అవుతున్న రాధే శ్యామ్ మంచి ఫీల్ ఉన్న సినిమాఅని అంటున్నారు. ప్ర‌భాస్ ప‌క్క‌న న‌టించ‌డం త‌న‌కు ఆనందం.. అంతేకాదు ఊహించినంత స్థాయిలో ఈ సినిమాతో ఆమె క్రేజ్ కూడా పెరిగిపోవ‌డం ఖాయం.

Read more RELATED
Recommended to you

Latest news