కులాలకు, మతాలకు అతీతంగా ఉంటామని, విభిన్న సాంస్కృతిక, సాంప్రదాయాలను ఏకతాటిపైన నడిపించే సామాజిక సమతను సమానతను తాము కొనసాగిస్తామని అంటున్నారు కేసీఆర్. ఇదే సమయంలో ఆంధ్రాతో కూడా ఆయన సఖ్యతను పెంచుకునేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు.అందుకే వైసీపీ నాయకులకు టీఆర్ఎస్ స్నేహాలు దృఢంగానే ఉన్నాయి. వాటికి కొనసాగింపుగా రామానుజా చార్యుల ఉత్సవాలు నిలిచాయి.జియర్ స్వామి ఆశ్రమానికి వెళ్లిన వారిలో రోజా తో పాటు చెవిరెడ్డి ఉన్నారు.గత కొంత కాలంగా చెవిరెడ్డి వివాదాలకు దూరంగానే ఉన్నారు కానీ రోజాకు చిత్తూరు జిల్లా పెద్దలెవ్వరూ పెద్దగా మద్దతివ్వడం లేదని తెలుస్తోంది. ఈ సమయంలో వీళ్లిద్దరూ తారసపడ్డారు. ఒకే ఆశ్రమంలో గంటల పాటు వైదిక కాండల్లో పాల్గొనడం విశేషం.
తెలంగాణ వాకిట సమతామూర్తి శ్రీరామానుజాచార్యుల విగ్రహావిష్కరణ, దీంతో పాటు శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం జరుగుతోంది. ఈ ఉత్సవాలకు తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రా నుంచి కూడా ప్రతినిధులు హాజరువుతున్నారు.వేడుకల్లో రోజా సందడి చేశారు. అదేవిధంగా మరోవైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి కూడా వెళ్లారు. చిన జియరు స్వామి ఆశీస్సులు అందుకున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ పెద్దలకూ స్వామిజీనే దిశానిర్దేశం చేస్తున్నందున వైసీపీ ఎమ్మెల్యేలు నిన్నటి వేళ ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలిసి ఆశ్రయాన్ని సందర్శించుకున్నారు. ఎప్పటి నుంచో కేసీఆర్ కూడా వైసీపీ పై సానుకూలంగా ఉండడంతో ఆంధ్రా, తెలంగాణ సంబంధాలు కూడా బాగున్నాయి. ముఖ్యంగా కేసీఆర్ రానున్న కాలంలో జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగేందుకు ఆంధ్రా నేతల మద్దతు ఎంతో అవసరం.ఈ సమయంలో ఆయన ఆంధ్రాతో పెద్దగా విభేదాలేవీ కోరుకోవడం లేదు. అన్నీ బాగుంటే ఆంధ్రాకు కావాల్సిన సాయం ఏమయినా చేయడానికి కూడా కేసీఆర్ ఇవాళ సిద్ధంగా ఉన్నారు.
జల వివాదాలను కూడా పరిష్కరించేందుకు తాను సిద్ధమేనని, అందుకు కేంద్రంతో తగువు పెట్టుకోవాల్సిన పని కానీ, ఢిల్లీ పెద్దలతో సంప్రతింపులు జరపాల్సిన అవసరం కానీ లేదని అంటున్నారాయన.