బాలయ్య రాజీనామా…మంత్రిగారు హిందూపురంలో గెలుస్తారా?

-

ఏపీలో జిల్లాల విభజనపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే…ఈ క్రమంలోనే హిందూపురం జిల్లా విషయంలో స్వయంగా నందమూరి బాలకృష్ణ రంగంలోకి దిగారు. హిందూపురం జిల్లా కేంద్రంగా అన్నీ వసతులు ఉన్న హిందూపురంని కేంద్రంగా పెట్టాలని డిమాండ్ చేస్తూ బాలయ్య పోరాటం చేస్తున్నారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని,  అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బాలయ్య మాట్లాడారు.

హేయమైన, నీచమైన రాజకీయాలను చూడలేదని, హిందూపురంని జిల్లా కేంద్రంగా చేయడానికి అన్ని వసతులు ఉన్నాయని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా అని ప్రకటించారని.. ఏదో ఆశించి, ప్రజలను మభ్యపెట్టేందుకు ఎన్టీఆర్ జిల్లా అని ప్రకటిస్తే సరిపోదని, తాము అధికారంలోకి వచ్చిన కూడా కడప జిల్లాకు వైఎస్సార్ పేరుని కొనసాగించాలని గుర్తు చేశారు.

అయితే బాలయ్య మాటలకు మంత్రి శంకర్ నారాయణ కౌంటర్ ఇచ్చారు.. ఏడు సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉండి హిందూపూర్ అభివృద్ధికి కృషి చేయ్యని బాలయ్య రాజీనామా చేయాలని ప్రజలే కోరుకుంటున్నారని, కేవలం సినిమా షూటింగ్ లేనప్పుడు మాత్రమే బాలకృష్ణకు ప్రజలు గుర్తుకు వస్తారని, ఆధ్యాత్మిక పట్టణమైన పుట్టపర్తి జిల్లా కేంద్రం ప్రకటించడం అందరికీ ఆనందదాయకమని మంత్రి అన్నారు.

అయితే మంత్రిపై టీడీపీ కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు. బాలయ్య ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని, దమ్ముంటే హిందూపురంలో వైసీపీ గెలవాలని సవాల్ విసురుతున్నారు. బాలయ్య మీద ఎవరు పోటీకి నిలబడిన ఓకే అంటున్నారు. అసలు మంత్రి అని జనాలకు తెలియని వారు, సొంత నియోజకవర్గాలని అభివృద్ధి చేసుకోలేని వారు కూడా…బాలయ్యపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని అంటున్నారు.

బాలయ్య ఎక్కడ ఉన్న హిందూపురం అభివృద్ధి కోసం ఎప్పుడు కృషి చేస్తుంటారు..అవసరమైతే సొంత డబ్బులు కూడా ఖర్చు పెడతారని, కానీ వైసీపీ నేతలు ప్రజల డబ్బులు వెనుకేసుకునే పనిలో ఉన్నారని, అలాంటి వారికి బాలయ్యపై విమర్శలు చేసే అర్హత లేదని తమ్ముళ్ళు ఫైర్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news