ప్రధానికి స్వాగతం పలికేందుకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నసీఎం కేసీఆర్

-

ప్రధాని నరేంద్ర మోదీ రేపు హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ఇక్రిశాట్ లో ఓకార్యక్రమంలో పాల్గొనడంతో పాటు ముచ్చింతల్ లోని సమతా విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అయితే ప్రోటోకాల్ ప్రకారం ప్రధానిని రిసీవ్ చేసుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్తారా..? లేదా..? అని అనుకుంటున్న సందర్భంలో… ప్రధానికి స్వాగతం పలికేందుకు వెళ్లకూడదనే ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఇటీవల బడ్జెట్ పై కేసీఆర్ మాట్లాడుతున్న సమయంలో ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలుకుతామన్న కేసీఆర్ తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు.

సీఎం స్థానంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు వెళ్లనున్నారు. ఈ నెల 5 వ తేదీన హైదరాబాద్ రానున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కి రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వాగతం పలుకనున్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. మధ్యాహ్నం 2.10 గంటలకు డిల్లీ నుండి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు ప్రధానమంత్రి చేరుకోనున్నారు. హైదరాబాద్ లో కార్యక్రమాలు ముగించుకుని వెళ్లే సమయంలో కూడా వీడ్కోలు పలుకనున్నారు మంత్రి శ్రీనివాస్ యాదవ్.

 

Read more RELATED
Recommended to you

Latest news