తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్.కే.రోజా. ఇవాళ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ఆమె ఈ సందర్భంగా కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా నిర్మాణం చేయిస్తున్నారు కేసీఆర్ అని కొనియాడారు. ఈ కాలంలో ఎవరికీ ఇలాంటి అవకాశం దక్కలేని పేర్కొన్నారు. గతంతో పోల్చితే ఇప్పుడు ఆలయాన్ని అద్భుతంగా డిజైన్ చేసి పునఃనిర్మాణ చేశారని, ఈ కాలంలో ఎవరికీ ఇలాంటి అవకాశం దక్కలేదని పేర్కొన్నారు.
భగవంతుడే కేసీఆర్ ద్వారా తనకు కావాల్సిన ఆలయాన్ని నిర్మించుకున్నారు అని వ్యాఖ్యానించారు రోజా. గుడి నిర్మించాలంటే భగవంతుడి ఆశీస్సులు ఉండాలి. సీఎం కేసీఆర్ అందరి సహకారంతో దేవుడి ఆశీస్సులతో ఆలయాన్ని నిర్మించారని కొనియాడారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషించే విధంగా ఆలయం నిర్మాణం జరిగింది. ముఖ్యంగా గుంటూరు నుంచి ఇక్కడికి రాయి తీసుకొచ్చారని.. ఎప్పటికీ తెలుగువారు అన్నదమ్ముల్లు, అక్కచెల్లెల్లుగా కలిసి ఉంటారని తెలిపారు. తండ్రి సమానులైన కేసీఆర్ సంతోషంగా ఉంటూ ప్రజలను సంతోషంగా ఉండేవిధంగా చూడాలని శ్రీవారిని కోరుకున్నట్టు వెల్లడించారు రోజా.