ఆర్థరైటిస్ నొప్పితో బాధపడుతున్నారా..? అయితే ఈ ఇంటి చిట్కాలని ఫాలో అవ్వండి..!

-

ఈ మధ్య కాలంలో చాలా మంది ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఆర్థరైటిస్ సమస్య తో బాధ పడే వాళ్ళు నొప్పిని తగ్గించుకోవాలంటే ఈ ఇంటి చిట్కాలను ప్రయత్నం చేయండి. వీటిని కనుక ఫాలో అయితే కచ్చితంగా ఆర్థరైటిస్ నొప్పి తగ్గుతుంది. అయితే మరి ఆర్థరైటిస్ పెయిన్ నుంచి ఎలా బయట పడాలి అనేది ఇప్పుడు చూద్దాం.

యూకలిప్టస్ ఆయిల్:

యూకలిప్టస్ ఆయిల్ ని ఉపయోగించడం వల్ల ఆర్థరైటిస్ సమస్య తగ్గుతుంది. యూకలిప్టస్ ఆయిల్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. అలానే ఫ్లవనోయిడ్స్ కూడా ఉంటాయి. ఇది నొప్పిని తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. దీనితో మసాజ్ చేయడం వలన తక్షణ రిలీఫ్ ని పొందొచ్చు.

పసుపుని వాడండి:

మీరు తినే ఆహారంలో పసుపును ఎక్కువగా వాడుతూ ఉండండి. ఆహార పదార్థాల్లో పసుపును ఉపయోగించడం వల్ల ఆర్థరైటిస్ నొప్పి తగ్గుతుంది. అలానే పసుపులో యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి.

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్:

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఆహారపదార్థాలను తీసుకోవడం వల్ల కూడా ఆర్థరైటిస్ సమస్య తగ్గుతుంది. కనుక ఆర్థరైటిస్ సమస్య తో బాధ పడేవాళ్ళు వీటిని కూడా తీసుకోండి. అదే విధంగా మెడిటేషన్ చేయడం వల్ల కూడా నొప్పి తగ్గుతుంది. డిప్రెషన్ తగ్గుతుంది. అలానే రిలాక్స్ గా ఉండొచ్చు. ఇలా ఈ విధమైన టిప్స్ ని ఫాలో అయితే కచ్చితంగా ఆర్థరైటిస్ నొప్పి తగ్గుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news