అసోం రాష్ట్ర ముఖ్య మంత్రి హిమంత బిశ్వ శర్మ.. రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ అన్నారు. అలాగే అసోం సీఎం హిమంతను వెంటనే బర్తరఫ్ చేయడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ నేడు రాష్ట్రంలో అన్ని పోలీసు స్టేషన్ లలో అసోం ముఖ్య మంత్రిపై ఫిర్యాదులు చేయనున్నట్టు తెలిపారు.
పోలీసు స్టేషన్ లలో ఫిర్యాదులు తీసుకోకుంటే.. అక్కడే ఆందోళనలు చేస్తామని ప్రకటించారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ పోలీసు స్టేషన్ లో అసోం సీఎంపై ఫిర్యాదు చేస్తారని అన్నారు. అలాగే ఈ నెల 18వ తేదీన కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు.. మహిళా కమిషనర్ కు ఫిర్యాదు చేస్తారని తెలిపారు. కాగ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అసోం ముఖ్య మంత్రి హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా.. ఆదివారం రాష్ట్రంలో పలు చోట్ల అసోం సీఎం దిష్టి బోమ్మలను దగ్ధం చేశారు.