బెంగళూరు వేదికగా ఐపీఎల్ మెగా వేలం 2022 రెండో రోజు ప్రారంభమైంది. తొలి సెట్ లో దక్షిణాఫ్రికా క్రికెటర్ మార్కరం ను సన్రైజర్స్ హైదరాబాద్. 2.6 కోట్లు వెచ్చించి అతడినీ కొనుగోలు చేసింది సన్రైజర్స్ హైదరాబాద్. మరోవైపు టీమిండియా సీనియర్ టెస్ట్ ప్లేయర్ రహానే కు ఈసారి ఊహించని షాక్ తగిలింది. అజింక్యా రహనే నేను కోల్కతా నైట్ రైడర్స్ కేవలం కోటి రూపాయలకు మాత్రమే కొనుగోలు చేసింది.
ఇక మన్దీప్ సింగ్ న్యూ ఢిల్లీ క్యాపిటల్స్ కోటి రూపాయలకు కొనుగోలు చేసింది. ఇది ఇలా ఉండగా తొలి సెట్లో ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, అలాగే టీ20 ప్రపంచ కప్ 2021 ఆస్ట్రేలియా సారధి తో సహా… పలువురు ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు.
ముఖ్యంగా టీమ్ ఇండియా టెస్ట్ ప్లేయర్ చటేశ్వర్ పుజారా కు ఊహించని పరిణామం చోటు చేసుకుంది. అతని కొనుగోలు చేసేందుకు ఏ ఒక్కటి కూడా ముందుకు రాలేదు. దీంతో పుజారా కూడా అండ్ సోల్డ్ జాబితాలో కి వెళ్ళిపోయాడు.