తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఓ రేంజ్ లో సెటైర్లు వేశారు. విద్యుత్ చట్టాలపై బండి సంజయ్ కి ఏమీ తెలియకుండా మాట్లాడుతున్నాడని చురకలంటించారు. ఆయనకు చదువే రాదు.. ఈ చట్టాల గురించి ఏం తెలుసు ? అన్ని గాలి మాటలు మాట్లాడుతున్నాడని సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు.
ఇలాంటి నాయకుడిని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడి గా నియమించడం చాలా సిగ్గుచేటు అని పేర్కొన్నారు. వెంటనే బండి సంజయ్ ని మార్చి వేరే నాయకుల్ని నియమించుకోవాలని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే విద్యుత్ సంస్కరణలను తాము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని మరో సారి తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి స్పష్టం చేశారు. నష్టపోయినా.. సరే విద్యుత్ సంస్కరణలను అంగీకరించమని తెల్చి చెప్పారు. విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తే.. తెలంగాణ రాష్ట్రానికి 0.5 శాతం అప్పులు నష్టం వస్తుందని అన్నారు. దీని వల్ల తెలంగాణ రాష్ట్రానికే ఏడాదికి రూ. 5 వేల కోట్లు అప్పులు అవుతాయని అన్నారు.