సీఎం జగన్ ఓ పులికేసి అని… టాలీవుడ్ హీరోలతో పొగిడించుకుంటున్నాడని శ్రీకాకుళం ఎంపి రామ్మోహాన్ నాయుడు చురకలు అంటించారు. స్పెషల్ స్టేటస్ హామీతో వైసిపి అదికారంలోకి వచ్చారని.. చిత్తసుద్ది ఉంటే 28 మంది ఎంపిలు రాజీనామా చేసి ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. మరుసటి క్షణం మేము పదవులకు రాజీనామా చేస్తామని.. సబ్ కమిటీలో స్పెషల్ స్టేటస్ అంశాన్ని ఎజెండాలో పెడితే డప్పు కొట్టి చెప్పారని గుర్తు చేశారు.
ఐదు అంశాలను తొలగిస్తే కేంధ్రాన్ని ప్రశ్నించరా..? అని నిలదీశారు. జగన్ వైఫల్యం , చేతగాని తనమే వెనుక్కు తీసుకున్నారని.. స్టాలిన్ ,మమత , కెసిఆర్ కేంధ్రానికి బయపడటంలేదని తెలిపారు. జగన్ కేంధ్రాన్ని గొంతెత్తి ఎందుకు అడగటం లేదని.. ఆగ్రహించారు. 151 మంది మినహా జగన్ ను ఎవరూ పొగిడే పరిస్దితి లేదని.. సినిమా వాళ్లను పిలిపించుకొని పొగిడించుకుంటున్నారని చురకలు అంటించారు. తుగ్లక్ లానే కాకుండా పులకేసిలా జగన్ పొగిడించుకుంటున్నారని.. ఎస్టాబ్లిస్ అయిన రామానాయుడు స్టుడియోనే ఇబ్బంది పెట్టారని తెలిపారు.