రోజుకు నాలుగైదు డ్రెస్సులు వేసుకుని ఫ్యాషన్ షో చేసే మోదీ… తెలంగాణకు ఏం చేశారు.: తలసాని

-

రోజుకు నాలుగైదు డ్రెస్సులు వేసుకుని ఫ్యాషన్ షో చేసే ప్రధాని మోదీ…తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కిషన్ రెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ఆయన వార్నింగ్ ఇచ్చారు. మూడేళ్లలో నిన్ను గెలిపించిన సికింద్రాబాద్ లో ఒక లక్ష రూపాయలు పని చేశారా..?అని ప్రశ్నించారు. హైదరాబాద్ వరదలప్పుడు కూడా పొలిటికల్ డ్రామాలు చేశారని విమర్శించారు. మీ ఇంకో బీజేపీ ఎంపీ బండిపోతే .. బండి ఇస్తా అన్నాడు కానీ ఒక రూపాయి అయినా ఇచ్చారా.. అని విమర్శించారు. కిషన్ రెడ్డి ఎన్ని నిధులు తీసుకువచ్చారు అని అన్నారు. మీ శక్తి ఎంత మా ముందట అని అన్నారు. మిమ్మల్ని ఎందుకు గెలిపించామని సికింద్రాబాద్ ప్రజలు అనుకుంటున్నారని తలసాని అన్నారు. గతంలో ఐటీఐఆర్ ని యూపీఏ గవర్నమెంట్ ఇస్తే… బీజేపీ రద్దు చేసిందన్నారు. తెలంగాణ దయాదాక్షిణ్యాలపైనే కేంద్రం నడుస్తున్న విషయాన్ని మరిచిపోవద్దని తలసాని అన్నారు. రైతాంగం నడ్డి విరిచింది బీజేపీ పార్టీ అని అన్నారు. అదానీ లాంటి ఇండస్ట్రియలిస్టులకు ధారాదత్తం చేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. సర్జికల్ స్టైక్ లాంటివి బీజేపీ రాజకీయాలు చేస్తుందని ఆయన విమర్శించారు. మీ జీవితం ఎప్పుడూ.. హిందుస్తాన్, పాకిస్తానేనా.. అని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news