పసుపు కోటలో ‘ముగ్గురు మొనగాళ్ళు’!

-

రాజకీయాల్లో ఏ నాయకుడుకైన అంతిమ లక్ష్యం…ప్రజలకు సేవ చేయడమే. అలా ప్రజలకు సేవ చేసే నాయకులకు ఎప్పుడు తిరుగుండదు..అలాంటి వారికి రాజకీయంగా ఎదురు ఉండదనే చెప్పొచ్చు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ముగ్గురు నాయకులు సైతం ప్రజలకు సేవ చేయడంలో ముందున్నారు. ఏపీలో అధికార, ప్రతిపక్ష నేతలు చాలామంది ఉన్నారు…కానీ అందరూ ప్రజలకు సేవ చేస్తూ, ప్రజా సమస్యలపై పోరాటం చేయరు. ఏదో రాజకీయంగా అవకాశం వస్తే ఆర్ధికంగా ఎలా బలపడాలి…ప్రత్యర్ధులని రాజకీయంగా ఎలా తోక్కేయాలని చూసే నాయకులే ఎక్కువ.

TDP
TDP

అదే సమయంలో ప్రజల కోసం పోరాడే నేతలు కూడా ఉన్నారు…అలా ప్రజల కోసం పోరాడుతున్న వారిలో ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు ఎప్పుడు ముందే ఉంటున్నారు. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి..ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు తమ ప్రాంతం కోసం ఎప్పుడు పోరాడుతూనే ఉన్నారు.

ప్రకాశం జిల్లా బాగు కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు…సమస్యల పరిష్కరించమని అధికార పార్టీని అడుగుతూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు సమస్యలపై లేఖస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. ఆ మధ్య రాయలసీమ ప్రాజెక్టు వల్ల ప్రకాశంకు నష్టం జరుగుతుందని, ఏ మాత్రం రాజకీయం ఆలోచించకుండా ఓపెన్ లెటర్ రాశారు. అలాగే ఆ మధ్య వెలిగొండ ప్రాజెక్ట్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్‌కు టీడీపీ ఎమ్మెల్యేలు లేఖ రాశారు.  ఆ ప్రాజెక్ట్‌కు నిధులు ఇవ్వొద్దంటూ కేంద్రానికి లేఖ రాసింది తెలంగాణ ప్రభుత్వం..దీనిపై స్పందిస్తూ.. వెలిగొండకు అనుమతులు లేవనడం సరికాదని, ఆ ఫిర్యాదుపై పునరాలోచన చేయాలని కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు.

ఇక తాజాగా ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాల జాబితాలో చేర్చాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌కు లేఖ రాశారు. అలాగే ఏపీ ప్రభుత్వం ప్రకాశం జిల్లా అభివృద్ధి పట్టించుకోవడం లేదని, వెలిగొండ పనులు నత్తనడకన సాగుతున్నాయని, అసలు ప్రకాశం జిల్లా అన్నింటా వెనుకబడుతుందని, జిల్లా పరిస్తితులని వివరించేందుకు సమయం ఇవ్వాలని లేఖలో కోరారు. అంటే తమ జిల్లా కోసం టీడీపీ ఎమ్మెల్యేలు గట్టిగా పోరాడుతూ…ప్రజల మన్ననలు పొందుతున్నారు..అధికార వైసీపీకి ఎక్కువమంది ఎమ్మెల్యేలు ఉన్న ఉపయోగం లేదని, జిల్లాలో ఉన్న ఈ టీడీపీ ముగ్గురు ఎమ్మెల్యేలే ప్రజల సమస్యల కోసం పోరాడుతున్నారని చెబుతున్నారు. మొత్తానికి ప్రకాశం టీడీపీలో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రజల కోసం నిలబడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news