ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా… కామాంధుల తీరు మారడం లేదు. దేశంలో ఎక్కడో ఓ చోట అత్యాచారాలు జరగుతూనే ఉన్నాయి. చట్టాలు ఎంత కఠినంగా చేసినా కూడా అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడటం లేదు. నిర్భయ, పోక్సో వంటి చట్టాలు ఉన్నా… కామాంధులు భయపడటం లేదు.
తాజాగా రాజస్థాన్ లో దారుణ సంఘటన జరిగింది. మైనర్ బాలికపై 16 మంది అత్యాచారానికి పాల్పడిన అమానవీయ సంఘటన జరిగింది. రాజస్థాన్ భరత్ పూర్లోని కోహ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటు చేసుకుంది. 13 ఏళ్ల మైనర్ బాలికపై అత్యంత దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు.
పోలీసులు చెప్పిన కథనం ప్రకారం ఫిబ్రవరి 11న బాలిక కట్టెల కోసం అటవీ ప్రాంతానికి వెళ్లగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను దగ్గర్లో ఉన్న పొలంలోకి తీసుకెళ్లి అత్యాాచారం చేశారు. తర్వాత అక్కడ నుంచి పారిపోయారు. ఈ ఘనపై ఫిబ్రవరి13న బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికి నిందితుల్లో నలుగురు లొంగిపోయారు. మిగిలిన వారి కోసం గాలింపు చేస్తున్నారు పోలీసులు.