ఏపీకి బిగ్ షాక్.. అప్పులపై కేంద్ర ఆర్థికశాఖ సంచలన ప్రకటన !

-

జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు కేంద్ర ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని కార్పొరేషన్లకు రుణాలు ఇచ్చే సందర్భంలో చాలా ఆచితూచి వ్యవహరించాలని… జాతీయ బ్యాంకులకు మార్గనిర్దేశం చేసింది కేంద్ర ఆర్థిక శాఖ. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ తో పాటు ఇతర కార్పొరేషన్ బ్యాంకుల నుంచి రుణాలు అందడం సంక్లిష్టమైంది.

రుణాలు ఇచ్చేందుకు అంగీకరించి… ఒప్పందాలు కుదుర్చుకుని, తనఖా ఒప్పందాలు, రిజిస్ట్రేషన్ ను పూర్తిచేసిన ఏపీఎస్డిసి అప్పు విషయంలోనూ బ్యాంకులు వెనకడుగు వేస్తున్నాయి. కార్పొరేషన్ల అన్ని ప్రభుత్వ గ్యారెంటీ తోనే రుణాలు పొందుతున్నాయి.

ప్రజలపై అదనపు సుంకాలు అలాగే పన్నులు విధించి తద్వారా సముపార్జించి ఆదాయంతోనే బ్యాంకుల అప్పులు తీర్చే ప్రభుత్వం తాజాగా ఏర్పాటు చేసింది. తాజా పరిణామంతో ఈ విధానానికి అవాంతరం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని కార్పొరేషన్లకు రుణాలు ఇచ్చే సందర్భంలో వ్యవహరించాలని పేర్కొంది కేంద్ర ఆర్థిక శాఖ.

Read more RELATED
Recommended to you

Latest news