తెలంగాణకు గుడ్ న్యూస్..త్వరలోనే 1000 కోట్ల పెట్టుబడులకు MRF గ్రీన్ సిగ్నల్

-

తెలంగాణకు గుడ్ న్యూస్.త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో రూ. 1000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటన చేసింది MRF కంపెనీ. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ పేర్కొంది. మరో వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడి పెడతాం అని ఈరోజు ఉదయం MRF కంపెనీ ప్రకటించిందన్నారు. నేటి తరం విద్యార్థులు స్కిల్స్ డెవలప్ అండ్ ఆప్ గ్రేడ్ చేసుకోవాలని పేర్కొన్నారు.

ఉపాధి అవకాశాలకు తగ్గట్టుగా… స్కిల్ సెట్ ని పెంచుకోవాలన్నారు. జాబ్ సీకర్స్ గానే కాదు… జాబ్ క్రియేటర్స్ గా మారే అవకాశాన్ని కూడా టీ-హబ్ ద్వారా కల్పిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి… ఎన్నో ఓటములు, ఒడిదుడుకులు ఎదుర్కొని… ఈనాడు ఇంతటి స్థాయికి కేసీఆర్ వచ్చారని.. ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి… లక్ష్యాన్ని చేరుకునే దిశగా శ్రమించాలన్నారు.

చేసే పనిలో పట్టుదల, సంకల్పం ఉండాలని.. ఐటీ నలుమూలలా విస్తరించాలని.. గ్రిడ్ తీసుకొచ్చామని పేర్కొన్నారు. ఉత్తర హైదరాబాద్ అభివృద్ధికి.. ఇది ఆరంభం మాత్రమేనని.. ఐటీ విస్తరణకు కావాల్సిన మౌళిక సదుపాయాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు.తెలంగాణ లో పథకాలు.. దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news