యూపీలో ప్రశాంతంగా కొనసాగుతున్న నాలుగో దశ ఎన్నికల పోలింగ్

-

ఉత్తర్ ప్రదేశ్ లో నాలుగో విడత ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. మొత్తం 7 విడత ఎన్నికల్లో ఈరోజు నాలుగో విడత ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 9 జిల్లాల పరిధిలో 59 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 624 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చబోతున్నారు.  ఉదయం 11 గంటల వరకు 22.62 శాతం పోలింగ్ నమోదైంది. పిలిభిత్, లఖింపూర్ ఖేరీ, సీతాపూర్, హర్దోయ్, ఉన్నావ్, లక్నో, రాయ్ బరేలీ, బందా మరియు ఫతేపూర్ జిల్లాల్లో ఈ 59 నియోజక వర్గాలు ఉన్నాయి. 

పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లక్నోలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. లఖీంపూర్ ఖేరి ఘటనలో నిందితుడు ఆశిష్ మిశ్రా తండ్రి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా లఖింపూర్ లోని బన్బీర్ పూర్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా… కేంద్ర భద్రతా బలగాలు చర్యలు తీసుకుంటున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ, సమాజ్ వాదీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీల మధ్య పోటీ నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news