సాక్షిపై కేసు నమోదు.. నేడు విశాఖకు నారా లోకేష్

-

అమరావతి : తెలుగు దేశం పార్టీ కీలక నేత నారా లోకేష్ ఇవాళ విశాఖ వెళ్లనున్నారు. తనపై అసత్య ఆరోపణలు ప్రచురించారని ఓ దినపత్రిక (సాక్షి) పై లోకేష్ రూ. 75 కోట్లకు విశాఖ 12 వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో ఇటీవలే పరువు నష్టం దావా వేశారు నారా లోకేష్.

2019 అక్టోబ‌ర్ 22న విశాఖ విమానాశ్రయంలో లోకేష్ ప్రజాధనంతో రూ. 25 లక్షలకు చిరుతిళ్లు తిన్నారని సాక్షిలో కథనం వచ్చింది. పత్రిక ప్రచురించిన తేదీల్లో తాను విశాఖలో లేనని ఇటీవే నారా లోకేష్ పిటీషన్‌ దాఖలు చేశారు.

అప్పటి ప్రభుత్వం ఆహ్వానం మీద వచ్చే అతిధుల మర్యాదల కోసం వెచ్చించే ప్రోటోకాల్ ఖర్చును తనపై అసత్యాలతో ప్రచురించారంటూ రూ. 75 కోట్లకు పరువు నష్టం దాఖలు చేశారు నారా లోకేష్‌. ఈ కేసు విచారణకు సంబంధించి విశాఖ కోర్టుకు స్వయంగా ఇవాళ హాజరుకానున్నారు నారా లోకేష్. అయితే.. ఈ కేసులో.. కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇక అటు విశాఖలో పోలీసులు అలర్ట్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news