
BJP రాష్ట్ర అధ్యక్షులు, KNR-MP బండి సంజయ్ కొడిమ్యాల మండలంలో గురువారం పర్యటించనున్నట్లు పార్టీ మండలాధ్యక్షులు రేకులపల్లి రవీందర్ రెడ్డి తెలిపారు. పర్యటనలో భాగంగా కొడిమ్యాల, నమిలికొండ, చింతలపల్లె, సూరంపేట గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజతో పాటు తిర్మలాపూర్, శనివారంపేట, హిమ్మత్ రావుపేట, కోనాపూర్, డబ్బుతిమ్మయ్యపల్లె గ్రామాల్లో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు.