తెలంగాణ రాష్ట్ర మహిళలకు కేసీఆర్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం విఠలాపూర్ లో పలు అభివృద్ధి, శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంతి హరీష్ రావు మాట్లాడుతూ… అభయా హస్తం డబ్బులు..మహిళల అకౌంట్ లో వేస్తామని…వడ్డిలేని ఋణాలను త్వరలోనే వేస్తున్నామని కీలక ప్రకటన చేశారు.
మన ఊరు..మన బడి కార్యక్రమం జూన్ నుంచి ప్రారంభిస్తున్నామని… ఇంగ్లీష్ మీడియంలో బోధన చేస్తారని తెలిపారు. ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని.. పామాయిల్ తోటలతో ఎకరానికి ఒక లక్ష రూపాయలు లాభం వస్తుంది…పామాయిల్ తోటలను రైతులు వేయాలని కోరారు.
బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో 16 లక్ష ఉద్యోగుల ఖాళీ గా ఉన్నా నింపడం లేదని.. తెలంగాణ రాష్ట్రంలో 60 వేల ఉద్యోగులను త్వరలోనే భర్తీ చేస్తామని ప్రకటన చేశారు.మోటర్లకు మీటర్లు పెడితే..5 వేల కోట్ల రూపాయలు ఇస్తామని బీజేపీ ప్రభుత్వం చెప్పుతుంది..కేసీఆర్ గొంతులో ప్రాణముండగా మోటర్లకు మీటర్లు పెట్టమని చెప్పారని స్పష్టం చేశారు. మన గ్రామాన్ని చక్కగా అభివృద్ధి చేసుకొని, ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దికున్నామని.. ఇది నాకు చాలా సంతోషంగా ఉందన్నారు.