బూడిద గుమ్మడికాయ జ్యూస్ తో బరువు త్వరగా తగ్గొచ్చు..క్యాన్సర్ కూడా..

-

పల్లెటూర్లలో ఉచితంగా అందరికి ఇచ్చే వెజిటబుల్ ఒకటి ఉంటుంది..అది మన ఇంట్లో ఉంది అంటే..పొరుగింటి వారికి అడగకున్నా ఇచ్చేస్తుంటాం..అదే బూడిదగుమ్మడికాయ. పశువల పాకల్లో, ఖాళీగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా వచ్చేస్తాయి. ఊర్లల్లో వారికి ఫ్రీగా వచ్చేస్తాయి..కానీ సిటీల్లో ఉండేవారికి కూడా అన్ని కూరగాయలకుంటే..ఇవి ఎప్పుడూ తక్కువగానే ఉంటాయి కేజీ 15-20రూపాయల మధ్యలో ఉంటుంది. బూడిదగుమ్మడితో కూర మాత్రమే కాదు..రసం చేసుకుని తాగితే కూడా చాలా లాభాలు ఉన్నాయి. బూడిదగుమ్మడి జ్యూస్ ను జీరో కాలరీ జ్యూస్ అంటారట. మనకు కాలరీస్ తక్కువ ఉండి, మినరల్స్, విటమిన్స్, పోషకాలు ఉండే ఆహారం కావాలి..అప్పుడే బాడీ కంట్రోల్ ఉంటుంది. అలాంటి వారికి ఈ బూడిదగుమ్మడి చాలా బాగా మేలు చేస్తుంది.

 

100 గ్రాములు బూడిదగుమ్మడిలో ఉండే పోషకాలు..

నీటిశాతం 96
కార్బోహైడ్రేట్స్ 2-3 గ్రాముల మధ్యలో ఉంటాయి.
శక్తి 10-11 కాలరీలు. 300Ml బూడిదగుమ్మడి జ్యూస్ తాగితే 30 కాలరీలే వస్తాయి. ఒక కప్పు కాఫీ తాగితేనే..60-70 కాలరీలు వచ్చేస్తాయి.

విటమిన్స్, మినరల్స్ మాత్రం పుష్కలంగా వస్తాయి. యాంటిఆక్సిడెంట్ జ్యూస్ గా చెప్పుకోవచ్చు. యాంటీఅల్సర్ జ్యూస్ కూడా..ఈ మధ్యకాలంలో చాలామందికి పొట్టలో మంట, యసిడిటీ, అల్సర్లు ప్రభావం ఎక్కువగా ఉంది. దీనివల్ల ఇరిటేషన్స్ కూడా వస్తున్నాయి. ఈ యాసిడ్సిస్ ను నూట్రలైజ్ చేయడానికి ఆల్కలిన్ జ్యూసెస్ కావాలి. నంబర్ వన్ ఆల్కలిన్ జ్యూస్ బూడిదగుమ్మడి జ్యూస్. ఇది పొట్టలో అల్సర్ ను హీల్ చేయడానికి, యాసిడ్ ను నూట్రలైజ్ చేయడానికి, లైనింగ్ వెమ్మట ఉండే మ్యూకస్ కణజాలానికి మంచి డీహైడ్రేషన్ లో స్టైజ్ నుంచి హైడ్రేట్ చేయడానికి మినరల్స్ కంటెంట్ ను అందించి..మ్యూకస్ సిక్రిషన్ పెంచడానికి ఉపయోగపడతుంది.

ఉదయంపూట కాఫీ,టీ, పాలు మానేసి..బూడిదగుమ్మడి ప్లెయిన్ జ్యూస్ తీసుకుని కావాలంటే..రెండు స్పూన్ల తేనె కలుపుకుని తాగొచ్చు.

అధికబరువు ఉన్నవారికి కూడా ఈ జ్యూస్ బాగా మేలు చేస్తుంది. బరువు తగ్గాలన్నా, కొవ్వుకరగాలన్నా కాలరీస్ ఎక్కువగా ఉండకూడదు. ఈ జ్యూస్ లో చాలా తక్కువ కాలరీస్ ఉంటాయి. తాగినప్పటికీ పొట్టఫుల్ అవుతుంది. విటమిన్స్, మినరల్స్ వస్తాయి. ఫైబర్ అందుతుంది. బాడీకి అనేక రకాల యాంటిఇన్ఫ్లమెంటరీ ప్రొపర్టీస్ వస్తాయి. కానీ వెయిట్ మాత్రం పెరగరు. వెయిట్ బాగా లాస్ అవ్వాలని అనుకున్నవారు..ఇతర వెజిటబుల్ జ్యూస్ కంటేకూడా..బూడిదగుమ్మడి జ్యూస్ ను రెగ్యులర్ గా తాగితే చాలు.

డయాబెటిక్ పేషెంట్స్ వాడితే షుగర్ కూడా పెరగదు. ఇందులో 3 గ్రాముల ఫైబర్ ఉండటంతో..గ్లూగోజ్ ను వెంటనే బ్లడ్ లోకి వెళ్లనివ్వకుండా…ఇది స్లోగా పంపుతుంది. షుగర్ 1శాతం పెరిగే అవకాశం ఉండదు. కాబట్టి డయాబెటిక్ పేషంట్స్ రెగ్యులర్ గా వాడుకోవచ్చు.

క్యాన్సర్ తో బాధపడేవారికి యాంటిక్యాన్సర్ గా కూడా ఈ జ్యూస్ ఉపయోగపడుతుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి చాలా మేలు చేస్తుంది.

ఒక కేజీ బూడిదగుమ్మడిని కట్ చేస్తే..నలుగురి సరిపడా జ్యూస్ చేసుకోవచ్చు. పావులీటర్ చొప్పున తాగొచ్చు. అయితే కాయను కట్ చేసినప్పుడు మొత్తం ఒకేరోజు జ్యూస్ చేసుకోం..కట్ చేసిన దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాం కదా..మరుసటి రోజు వాడేముందు..పైన లేయర్ ను తీసేయండి..అంచులవెంబడి ఆక్సిన్ తో రియాక్షన్ జరిగి అంచు చెడిపోతుంది. చాలామంది ఇలా కట్ చేసినవాటిని ప్లాస్టిక్ కవర్లో పెట్టేసి కూడా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తుంటారు. అలా అయినా కూడా అంచులను కట్ చేయడమే బెటర్.

ముక్కలతో కొబ్బరిపాలు చేసి కూర కూడా చేస్తారు. ఇలా జ్యూస్ కి, కూరలకు విరవిగా వాడుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.

ఈరోజుల్లో ఉద్యోగ, వ్యాపారాలు చేసుకునే వారికి కాలరీస్ తక్కువ ఉన్న ఫుడ్ కావాలి..కాబట్టి మార్కెట్ కు వెళ్లినప్పుడు బూడిదగుమ్మడికాయను చూసి ఇది మనకెందుకులే అనుకోకుండా..ఒకటి తెచ్చుకుని వాడుకోండి. వారంలో ఒక్కసారైనా తింటూ ఉంటే బాడీకి కావాల్సిన పోషకాలను అందించినట్లే అంటున్నారు ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news