గ్రీన్ టీ తాగి బ్యాగ్స్‌ను పడేస్తున్నారా.? వాటితో ఎన్ని లాభాలో..!

-

బరువు తగ్గడానికి, ఆరోగ్యంగా ఉండటానికి చాలా మంది గ్రీన్ తాగటం అలవాటుగా చేసుకుంటున్నారు. ఇది తాగటం ఆరోగ్యానికే మంచిదే..అయితే గ్రీన్ టీలో కూడా టీ బ్యాగ్స్ ను వాడేందుకు చాలామంది మొగ్గుచూపుతున్నారు. బ్యాగ్స్ అయితే చేసుకోవడం ఈజీగా అయిపోతుందని..
ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే..గ్రీన్ టీ తాగిన తర్వాతా..ఆ బ్యాగ్ లను పారేయకండి.. గ్రీన్ టీ బ్యాగ్ లతో ఎన్నో లాభాలు ఉన్నాయి తెలుసా.? అవి తెలిస్తే..ఈ సారి నుంచి టీ తాగిన తర్వాత బ్యాగ్స్ కూడా యూస్ చేసుకుంటారుగా..ఇంకెందుకు ఆలస్యం అవేంటో చూసేద్దామా.!
టీ తాగిన తర్వాత టీ బ్యాగ్‌లో ఉండే మిశ్రమాన్ని ఫేస్‌ స్క్రబర్‌గా ఉపయోగించుకోవచ్చు. ఫేస్‌పై అప్లై చేసి నెమ్మదిగా స్క్రబింగ్‌ చేసుకుంటే ముఖంపై ఉన్న రంధ్రాలు చిన్నగా మారుతాయి. అంతేకాదండోయ్… ముఖంపై మెరుపు వస్తుంది. ఇక ఈ మిశ్రమానికి ఒక టేబుల్‌ స్పూన్‌ తేనె కలిపి ముఖానికి అప్లై చేసి 5 నిమిషాలు స్క్రబింగ్‌ చేయాలి. ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేస్తే ముఖం ప్రకాశవంతంగా మారుతుంది. ఫేస్ మీద ఉన్న టాన్ అంతా పోతుంది.
వెంటుక్రల అందానికి టీ బ్యాగ్స్‌ ఉపయోగపడతాయని మీకు తెలుసా.?. ఇవి వెంట్రుకలకు షైనింగ్‌, మెత్తదనాన్ని అందిస్తాయి. ఇందుకోసం షాంపూతో స్నానం చేసే కంటే ముందు టీబ్యాగ్‌లను వేడి నీలో వేయాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి ఆ తర్వాత షాంపూతో స్నానం చేయాలి.
 చర్మ సంబంధిత సమస్యలకు కూడా టీ బ్యాగ్స్‌ ఉపయోగపడతాయి..మనకు శరీరంలో ఎక్కడైనా.. దద్దుర్లు ఉంటే.. టీ బ్యాగ్‌లోని మిశ్రమాన్ని అప్లై చేయడం సమస్య పోతుంది.
ఒక బౌల్ తీసుకొని అందులో వేడి నీటిని పోయండి. ఆ తర్వాత టీబ్యాగ్స్‌ వేసి కాటన్‌ టవల్‌ను ముంచాలి. తర్వాత నీటిని బాగా పిండేసి టవల్‌ను ముఖం మీద వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుందట.
వాడేసిన టీ బ్యాగ్స్‌ కళ్లకు కూడా మేలు చేస్తాయి. టీ బ్యాగ్‌లను వాడిన తర్వాత కొద్దిసేపు ఫ్రిడ్జ్‌లో ఉంచాలి. ఇలా చల్లబడిన తర్వాత కళ్లపై పెట్టుకొని కళ్లు మూసుకోవాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తే కళ్లవాపు, నొప్పి తగ్గుతుంది. డార్క్‌ సర్కిల్స్‌ కూడా తగ్గుతాయట.
చూశారా ..గ్రీన్ టీ ఆరోగ్యానికి మేలు చేస్తే..ఆ టీ బ్యాగ్ అందానికి మేలు చేస్తుంది. కాబట్టి మీలో ఎ‌వరికైనా గ్రీన్ టీ తాగే అలవాటు ఉంటే..ఇలా కూడా చేసేయండి. ఆరోగ్యంతో పాటు అందం అంటే ఇదే కదా..!
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news