శాస‌న స‌భ్యులు హ‌క్కులకు విఘాతం.. ప్ర‌సంగం లేక‌పోవంపై గ‌వ‌ర్న‌ర్ అసంతృప్తి

-

తెలంగాణ రాష్ట్రంలో గ‌వ‌ర్న‌ర్, రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌ధ్య విభేదాలు ఇంకా పెర‌గుతున్నాయి. ఇప్ప‌టికే రాష్ట్ర ప్ర‌భుత్వం.. వ‌చ్చే అసెంబ్లీ సమావేశాల‌ను గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం లేకుండానే నిర్వ‌హించాల‌ని సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యం పై తాజా గా గవ‌ర్న‌ర్ త‌మిళ సై కీల‌క వ్యాఖ్య‌లే చేశారు. వ‌చ్చే అసెంబ్లీ స‌మావేశాల్లో త‌న ప్ర‌సంగం లేక పోవ‌డంపై గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సై సౌంద‌ర రాజ‌న్ తీవ్రం అసంతృప్తికి గురి అయ్యారు.

గ‌త ఏడాది రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌నితీరు ను అసెంబ్లీలో చ‌ర్చించే అవ‌కాశాన్ని శాస‌న స‌భ్యులు కోల్పోతున్నార‌ని అన్నారు. ఇలా చేయ‌డం శాస‌న స‌భ్యుల హ‌క్కుల‌కు విఘాతం క‌లిగించ‌డ‌మే అని అన్నారు. అయితే ఈ బ‌డ్జెట్ సమావేశాల్లో త‌న ప్రసంగం ఉంటుందని… ప్ర‌భుత్వం త‌న‌కు ముందు చెప్పింద‌ని అన్నారు. కానీ ఇప్పుడు ప్ర‌సంగం లేద‌ని చెబుతున్నార‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. త‌న ప్ర‌సంగం లేకుండా చేయ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వం హాస్యాస్ప‌దంగా ఉంద‌ని పెద‌వి విరిచారు. అలాగే ఇప్పటి వ‌ర‌కు సంప్రదాయంగా ఉన్న ఈ ప‌ద్ద‌తిని ఈ ప్ర‌భుత్వం ర‌ద్దు చేసింద‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news