బచావత్ ట్రైబ్యునల్ క్యారీ ఓవర్ స్టోరేజీ కింద శ్రీ శైలం నాగార్జున సాగర్ లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ అనుమతించిన 150 టీఎంసీల్లో.. తెలంగాణ రాష్ట్రానికి 125 టీఎంసీలు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. 125 టీఎంసీలు కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శనివారం బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ లో అఫిడవిట్ ను దాఖలు చేసింది. నీటి లభ్యత తక్కువగా ఉన్న సమయాల్లో ఇదే నిష్పత్తిలోనే నీటి పంపకాలు జరగాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ లో కోరింది.
కాగ నీటి వినయోగానికి ఆపరేషన్ ప్రొటోకాల్ ను శ్రీ శైలం నాగార్జున సాగర్.. ఈ రెండు రిజర్వాయర్లు సరిపోతాయని తెలిపింది. దీని కిందకు జూరాల ప్రాజెక్టు అవసరం లేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే బ్రిజేష్ ట్రైబ్యునల్ లో దాఖలు చేసిన ఆఫిడవిట్ లో.. నీటి వినియోగం పై 6 ప్రాధాన్యాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. అలాగే ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం.. ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టుల వారీగా నీటి వినియోగం తో పాటు తక్కువ నీటి లభ్యత తక్కువ ఉన్న సమయాల్లో వినయోగంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు సూచనలు చేసింది.