రాధేశ్యాం సినిమాకు గుడ్ న్యూస్…. తెలంగాణలో ఐదో షోకు అనుమతిచ్చిన ప్రభుత్వం

-

తెలంగాణ ప్రభుత్వం ముందు నుంచి సినిమా రంగానికి అనుకూలంగా ఉంది. టాలీవుడ్ లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటుంది. అదే విధంగా సినిమా పరిశ్రమ నుంచి వచ్చే విన్నపాలను నెరవేరుస్తోంది. గతంలో టికెట్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. బడా సినిమాల ఐదో షోకు అనుమతులు కూడా ఇచ్చింది. 

తెలంగాణలో సినీ ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా తెలంగాణలో ఐదో షోకు అనుమతి ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 1 గంట మధ్యలో ఐదో షో ప్రదర్శనలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రేపు ప్రభాస్ ‘ రాధేశ్యాం ’ సినిమా విడుదలవుతున్న సమయంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యాం ప్యాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవుతోంది. తెలుగు, హిందీ, కన్నడ, మళయాళ, తమిళ భాషల్లో కూడా విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచానాలను పెంచాయి. తెలంగాణలో అదనపు షోకు అనుమతి ఇవ్వడంతో రికార్డ్ కలెక్షన్లు కూడా వచ్చే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news