పోస్ట్ ఆఫీస్ అకౌంట్ వుందా..? అయితే తప్పక ఈ రూల్ చూడాలి..!

-

ఇండియా పోస్ట్ ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ ని తీసుకు రానుంది. పోస్ట్ ఆఫీస్‌లోమంత్లీ ఇన్‌కమ్ స్కీమ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, టైమ్ డిపాజిట్ అకౌంట్స్ కి ఈ రూల్స్ రానున్నాయి. ప్రతీ నెల, మూడు నెలలకు, ఏడాదికి ఓసారి వచ్చే వడ్డీని నగదు రూపంలో ఇక నుండి ఇవ్వదు. మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

 

వడ్డీని సేవింగ్స్ అకౌంట్‌లో జమ చేస్తుంది ఇండియా పోస్ట్. సేవింగ్స్ అకౌంట్ నుంచే తమకు వచ్చిన వడ్డీని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ రూల్ 2022 ఏప్రిల్ 1 నుంచి రానుంది. పోస్ట్ ఆఫీస్‌లోమంత్లీ ఇన్‌కమ్ స్కీమ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, టైమ్ డిపాజిట్ ద్వారా వచ్చే వడ్డీని 2022 ఏప్రిల్ 1 నుంచి ఖాతాదారుల పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ లేదా బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేస్తామని చెప్పింది.

అయితే పోస్ట్ ఆఫీస్‌లోమంత్లీ ఇన్‌కమ్ స్కీమ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, టైమ్ డిపాజిట్ ఖాతాదారులు తమ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ లేదా బ్యాంక్ అకౌంట్‌ను 2022 మార్చి 31 లోగా లింక్ చేయాలి. లేదు అంటే ఆ వడ్డీ సంబంధిత MIS/SCSS/TD అకౌంట్లలో జమ చేస్తారు. సేవింగ్స్ అకౌంట్‌లోకి జమ చేయించుకోవచ్చు. లేదా చెక్ ద్వారా తీసుకోవచ్చు. 2022 ఏప్రిల్ 1 తర్వాత నగదు రూపంలో వడ్డీ మాత్రం రాదు.

Read more RELATED
Recommended to you

Latest news