దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేకర రెడ్డి గారి ముద్దుల కూతురు వైయస్ షర్మిల… తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టినప్పటి నుంచి చాలా చురుగ్గా పని చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే.. ప్రజల్లో తిరుగుతున్నారు. ఇందులో భాగంగానే టిఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టేందుకు వైయస్ షర్మిల పాదయాత్ర నిర్వహించారు.
అయితే తాజాగా ఈ పాదయాత్రను పునః ప్రారంభించాలని వైయస్ షర్మిల నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే ఇవాల్టి నుంచి వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర తిరిగి ప్రారంభించ నున్నారు.
ఇందులో భాగంగానే ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు నల్గొండ జిల్లాలోని కొండపాక గూడెం గ్రామానికి చేరుకుని… స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు వైఎస్ షర్మిల. అలాగే ఇవాళ సాయంత్రం నార్కట్ పల్లి లో బహిరంగ సభలో మాట్లాడతారు వైయస్ షర్మిల. కాగా గత ఏడాది అక్టోబర్ 20న ప్రారంభం అయిన పాదయాత్ర… నవంబర్ 09న స్థానిక సంస్థల ఎన్నికలు, కరోనా ఉధృతి కారణంగా తాత్కాలిక వాయిదా పడింది. దీంతో ఇవాళ షర్మిలా పాదయాత్ర ప్రారంభించనున్నారు.