ఉద్యోగాల భర్తీపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బి జనార్దన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. న్యాయ వివాదాలు తలెత్తకుండా.. నిర్ణీత గడువులోగా ఉద్యోగ నియామక ప్రక్రియ పూర్తి చేశారా చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. త్వరలోనే వెలువడే ప్రభుత్వ ఉత్తర్వులతో పోస్టులు అలాగే భర్తీ ప్రక్రియ మరింత స్పష్టత వస్తుందని ఆయన తెలిపారు.
టీఎస్పీఎస్సీ నియామకాల పై… సోషల్ మీడియాలో మరియు ఇతర మాధ్యమాలలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మవద్దని విద్యార్థులను కోరారు. అలాంటి అసత్య ప్రచారాలు ప్రచారం చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వీరిలో అభ్యర్థులు ఉంటే పరీక్షలు రాయకుండానే నిషేధం విధిస్తామని హెచ్చరించారు. అభ్యర్థుల సంఖ్య 30 వేల వరకు ఉంటే ఆయా ఉద్యోగాలకు ఆన్లైన్లో పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. అంతకుమించి అభ్యర్థులు ఉండి ఆన్లైన్ లో నిర్వహణ సదుపాయాలు ఉంటే.. సందర్భం మేరకు నిర్ణయం తీసుకుంటామని జనార్దన్ రెడ్డి వివరణ ఇచ్చారు.