పట్టు బిగిస్తున్న రష్యా.. ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను స్వాధీనం చేసుకునే దిశలో రష్యన్ ఆర్మీ

-

రష్యా పట్టుబిగిస్తోంది. ఉక్రెయిన్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వరసగా ప్రధాన నగరాలను ఆక్రమించుకుంటూ పోతోంది. ఇప్పికే చెర్నిహెవ్, ఖార్కీవ్, ఒడిస్సా, మరియోపోల్, మెలిటో పోల్ నగరాలను నెమ్మదిగా తన గుప్పిట్లోలోకి తెచ్చుకుంది. మరోవైపు ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను ఆక్రమించుకునే దిశగా రష్యా వెళ్తోంది. ఈరోజు ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాలపై భారీ స్థాయిలో దాడులు చేస్తోంది. ట్యాంకులు, మిస్సైళ్లలో రష్యా ఆర్మీ విరుచుకుపడుతోంది. మరియోపోల్ పట్టణంపై బాంబుల దాడులు ముమ్మరం చేసింది. ఎంతో అందంగా ఉండే ఈ నగరాలు ప్రస్తుతం మసిదిబ్బలుగా మారుతున్నాయి. 

ప్రస్తుతం అన్ని నగరాలను రష్యా సేనలు చుట్టుముట్టాయి. కీవ్ కు కేవలం 15 కిలోమీటర్ల దూరంలోనే రష్యన్ బలగాలు ఉన్నాయి. ఏ క్షణమైనా.. తీవ్రమైన దాడులతో విరుచుకుపడే అవకాశం ఉంది. రష్యా దాడుల వల్ల ఇప్పటికే పలు చిన్న పట్టణాలు నామరూపాలు లేకుండా అయ్యాయని అధ్యక్షుడు జెలన్ స్కీ వెల్లడించారు. ఇప్పటి వరకు రష్యాతో యుద్ధం కారణంగా 1300 మంది ఉక్రెయిన్ సైనికులు మరణించినట్లు, 579 మంది పౌరులు మరణించినట్లు జెలన్ స్కీ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news