నాగ చైతన్య అంటే ఇష్టం కాని నేను ‘గే’ కాదు.. తాగి ట్వీట్స్ వేసిన వర్మ..!

-

అక్కినేని నాగ చైతన్య, సమంత కలిసి నటించిన సినిమా మజిలీ. శివ నిర్వాణ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఈవెంట్ కు స్పెషల్ గెస్టులుగా వెంకటేష్, నాగార్జున పాల్గొన్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఆర్జివి చేసిన ట్వీట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

రాం గోపాల్ వర్మ నాలుగు పెగ్గులు వేసుకుని తాగాక ట్వీట్ చేశాడట. మజిలీ ట్రైలర్ ను ముందు పొగుడుతూ ట్వీట్స్ చేసిన వర్మ ఆ తర్వాత చైతుని పొగడ్తలతో ముంచెత్తాడు. ఇంతకు ముందు ట్వీట్ చేసేటప్పటికి నేను నాలుగు పెగ్గుల వోడ్కా తీసుకున్నా. ఒకవేళ నేను వోడ్కా తాగుండకపోతే పరిస్థితి వేరేలా ఉండేది. అసలు విషయం ఏంటంటే.. ట్రైలర్‌లో సమంత కన్నా నువ్వే నాకు బాగా నచ్చావ్. నేను ‘గే’ను కాదు. నీకన్నా నేను ఎక్కువగా ఆమెను ప్రేమిస్తున్నాను అంటూ ట్వీట్స్ వేశాడు వర్మ. అయితే ఆ ట్వీట్స్ మళ్లీ డిలీట్ చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news