ఆగస్ట్ 15 లోపల నువ్వు రుణమాఫీ చెయ్యక పోతే నువ్వు రాజీనామా చెయ్యాలని సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు కేసీఆర్. నేను కూడా రాజీనామా ఇస్తున్న అని హరీష్ రావు రాజీనామా ఇచ్చిండు, కానీ ఈ ముఖ్యమంత్రి పోకుండా తోక ముడిచిండని ఆగ్రహించారు కేసీఆర్. నేను ఒక్కడిగా బయలదేరిన్నాడు ఎవరికీ తెలంగాణ వస్తుందని నమ్మకం లేదన్నారు.
సరే అని ఆమరణ దీక్షకు పూనుకున్నా.. నన్ను అరెస్ట్ చేసి ఇదే ఖమ్మం జిల్లా జైలులో పెట్టారు. ఆ నాడు ఇక్కడ ఖమ్మం జిల్లా బిడ్డలు నాకు బ్రహ్మరథం పట్టి ఆశీర్వదించి మద్దతు కూడా తెలిపారని గుర్తు చేశారు కేసీఆర్. అబద్ధాలు,మోసం చేసిన వ్యక్తులు ఎంతోకాలం ఉండలేరన్నారు. వాళ్లు వాళ్లే చెప్పుకుంటున్నారు రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికలు అవ్వగానే బీజేపీలోకి జంప్ కొడుతాడని, ఎవడు ఎళ్లకి జంప్ కొడుతాడో.. ఎవడు ఎళ్ల ఉంటాడో, ఏం జరుగుతదో తెలవని ఒక భయంకరమైన రాజకీయ అనిశ్చితి ఉందన్నారు కేసీఆర్.