ధాని మోదీ హైదరాబాద్ వచ్చి బహిరంగ సభ నిర్వహించినప్పుడు ఉన్న ఒక్క ఎమ్మెల్యే సభకు రావాలి కదా. కానీ.. రాజా సింగ్ ప్రధాని మోదీ సభకు డుమ్మా కొట్టారు. ఇదే ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో చర్చనీయాంశమైంది.
తెలంగాణ బీజేపీకి ఆయనొక్కరే దిక్కు. మేం మహామహులం అని చెప్పుకునే లక్ష్మణ్, కిషన్ రెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. 119 సీట్లలో పోటీ చేస్తే బీజేపీ గెలిచింది ఒకే ఒక్క సీటు గోషామహల్ లో. రాజా సింగ్ ఒక్కరు గెలిచారు. 103 సీట్లలో డిపాజిట్లే రాలేదు బీజేపీకి. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ పరిస్థితి అది.
అయితే.. ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. ప్రధాని మోదీ హైదరాబాద్ వచ్చి బహిరంగ సభ నిర్వహించినప్పుడు ఉన్న ఒక్క ఎమ్మెల్యే సభకు రావాలి కదా. కానీ.. రాజా సింగ్ ప్రధాని మోదీ సభకు డుమ్మా కొట్టారు. ఇదే ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో చర్చనీయాంశమైంది.
తెలంగాణకు చెందిన బీజేపీ నేతలంతా ఈ సభకు హాజరయ్యారు.. ఒక్క రాజా సింగ్ తప్ప. మరో విషయం ఏంటంటే.. మోదీ సభ జరిగిన ఎల్బీ స్టేడియం గోషామహల్ నియోజకవర్గం పరిధిలోకే వస్తుంది. ఎలా చూసుకున్నా.. ప్రధాని మోదీ సభకు రాజా సింగ్ హాజరుకావాల్సిందే. కానీ హాజరు కాలేదు.
అయితే.. రాజా సింగ్ ప్రధాని సభకు హాజరుకాకపోవడం వెనుక వేరే కారణాలు ఉన్నాయట. ఆయనకు బీజేపీ అధిష్ఠానంతో కొన్ని విభేదాలు ఉన్నాయట. మొన్న ఎంపీ టికెట్ల కేటాయింపులో రాజా సింగ్ అసంతృప్తిగా ఉన్నారట. దీంతో ఆయన ప్రధాని సభకు డుమ్మాకొట్టారని వార్తలు వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఆయన పార్టీ తరుపున ప్రచారం కూడా చేయట్లేదట. ఇంకొందరు నేతలు మాత్రం రాజా సింగ్ పార్టీ మారుతారని అంటున్నారు. అయితే.. ప్రస్తుతానికి రాజా సింగ్ పార్టీ మారే అవకాశం లేదని.. తెలంగాణలో ఆయనకు సరిపోయే పార్టీ బీజేపీ తప్ప మరోటి లేదన్న వార్తలు కూడా వస్తుండటం గమనార్హం.