పాయల్ రాజ్ పుత్ ఐటం సాంగ్.. ఆరెక్స్ బ్యూటీ అదరగొట్టింది..!

-

ఆరెక్స్ 100 సినిమాతో యూత్ ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేసిన పాయల్ రాజ్ పుత్ లేటెస్ట్ గా సీత సినిమాలో ఐటం సాంగ్ చేసింది. తేజ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ జంటగా నటిస్తున్నారు. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా టీజర్ ఇప్పటికే ప్రేక్షకులను మెప్పించగా లేటెస్ట్ గా సినిమా నుండి పాయల్ ఐటం సాంగ్ రిలీజైంది.

పాయల్ పరువాలతో రెచ్చిపోతూ బుల్లెట్ మీదొచ్చె బుల్ రెడ్డి అంటూ దుమ్ముదులిపేసింది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ మాస్ బీట్ తో ఆడిటోరియం అంతా దద్దరిల్లేలా ఉంది. కచ్చితంగా పాయల్ ఐటం సాంగ్ సీత సినిమాకు ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. ఏప్రిల్ 25న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమాతో అయినా బెల్లంకొండ హీరో హిట్టు కొడతాడో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news