టీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం.. ‘ చిల్లర సమస్య’ను పరిష్కరించేందుకు ఛార్జీల్లో హెచ్చుతగ్గులు

-

తెలంగాణ ప్రయాణికులకు షాకింగ్ న్యూస్ చెప్పింది టీఎస్ఆర్టీసీ. ఆర్టీసీలో చిల్లర సమస్యలను పరిష్కరించేందుకు ఛార్జీలను పెంచడంతో పాటు కొన్ని సర్వీసుల్లో తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇటీవల చిల్లర సమస్యలను పరిష్కరించేందుకు ఆర్టీసీ ఎండీ సజ్జనాల్ సమావేశం నిర్వహించారు. ఈమేరకు ఛార్జీల్లో హెచ్చుతగ్గులు చేస్తూ ఛార్జీలను రౌండ్ ఫిగర్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పల్లెవెలుగు సర్వీసుల్లో ఛార్జీలను రౌండప్ చేసింది. ఉదాహరణకు టికెట్ ఛార్జీ రూ. 12 ఉంటే దాన్ని రూ. 10 తగ్గించడంతో పాటు రూ. 13 ఉంటే దాన్ని రూ. 15 పెంచుతూ ఇలా చిల్లర సమస్యలను  పరిష్కరించేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు లగ్జరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సులపై రూ.1,  సూపర్‌ లగ్జరీ, ఏసీ బస్సులపై రూ.2 పెంచుతూ, టోల్‌ప్లాజా ధర టికెట్‌పై రూపాయి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆర్టీసీ నష్టాల్లో నడుస్తోంది. లాస్ నుంచి బయటపడేందుకు ఎక్స్ప్రెస్, లగ్జరీ, సూపర్ లగ్జరీ బస్సులకు ఛార్జీలు పెంచాలని ఆర్టీసీ.. సీఎంకు నివేదించింది. అయితే ఈ నిర్ణయం సీఎం దగ్గర పెండింగ్ లో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news