తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ చలాన్లను చెల్లించేందుకు రాష్ట్ర పోలీస్ శాఖ బంపర్ ఆఫర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రతి పెండింగ్ చలాన్లపై ఏకంగా 75 శాతం డిస్కౌంట్ ఇవ్వడంతో.. వాహనా దారులు తమ పెండింగ్ చలాన్లను చెల్లించేందుకు ఎగబడుతున్నారు. ప్రతి నిమిషానికి 700 నుంచి 1000 వరకు పెండింగ్ చలాన్లను వాహనాదారులు చెల్లిస్తున్నారు. కాగ ఈ ఆఫర్ ను ఈ నెల 1 వ తేదీ నుంచి ప్రారంభం అయింది. కాగ ఈ నెల చివరి తేదీ వరకు ఈ బంపర్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. కాగ ఈ ఆఫర్ వచ్చి నేటికి 18 రోజులు గడుస్తుంది.
కాగ ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వ ఖజానా కు భారీగానే డబ్బులు వచ్చినట్టు తెలుస్తుంది. కాగ ఈ 18 రోజుల్లో దాదాపు 1.3 కోట్లకు పైగా.. మంది పెండింగ్ చలాన్లను చెల్లించారు. దీంతో ప్రభుత్వ ఖజానా కు రూ. 135 కోట్ల ఆదాయం వచ్చినట్టు తెలుస్తుంది. కాగ పెండింగ్ చలాన్లను చెల్లించడానికి జీహెచ్ఎంసీ లో ఉన్న వాహనాదారులు మాత్రమే ముందుకు వస్తున్నట్టు తెలుస్తుంది.
జిల్లాల నుంచి స్పందన లేదని పోలీసు వర్గాలు అంటున్నారు. కాగ రాష్ట్ర ప్రభుత్వం రూ. 500 కోట్ల టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 6 కోట్ల పెండింగ్ చలాన్లు ఉన్నాయి. కాగ జిల్లాల్లో పెండింగ్ చలాన్ల చెల్లింపులకు అవగాహాన కార్యక్రమాలు చెపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సమాచారం.