Breaking : ఆర్టీసీ బ‌స్సుల్లో చిల్ల‌ర స‌మ‌స్య‌కు చెక్.. అమ‌ల్లోకి రౌండ‌ప్ విధానం

-

తెలంగాణ ఆర్టీసీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆర్టీసీ బ‌స్సుల‌లో ప్ర‌స్తుతం ప్ర‌ధానంగా ఉన్న చిల్ల‌ర‌ స‌మస్య‌ను ప‌రిష్క‌రించ‌డానికి నిర్ణ‌యం తీసుకుంది. దాని కోసం రౌండ‌ప్ విధాన్ని టీఎస్ ఆర్టీసీ నేటి నుంచి అమ‌ల్లోకి తీసుకువ‌చ్చింది. దీంతో నేటి నుంచి టీఎస్ ఆర్టీసీ బ‌స్సుల్లో చిల్ల‌ర స‌మస్య‌కు చెక్ ప‌డ‌నుంది. కాగ టీఎస్ ఆర్టీసీ బ‌స్సులల్లో చిల్ల‌ర స‌మ‌స్య ఎక్కువ ఉంద‌ని.. కండ‌క్ట‌ర్లు, ప్ర‌యాణికుల నుంచి వ‌స్తున్న ఫిర్యాదుల మేర‌కు టీఎస్ ఆర్టీసీ చైర్మెన్ బాజీరెడ్డి గోవ‌ర్ధ‌న్, ఆర్టీసీ ఎండీ స‌జ్జాన‌ర్ ఈ రౌండ‌ప్ నిర్ణ‌యాన్ని తీసుకున్నారు.

ఈ రౌండ‌ప్ విధానం ద్వారా రూ.12 ఛార్జీ ఉన్న చోట టికెట్‌ ధర రూ.10గా త‌గ్గేలా రౌండప్ విధాన్ని టీఎస్ ఆర్టీసీ తీసుకువ‌చ్చింది. అలాగే రూ.13 తో పాటు రూ.14 ఉన్న టికెట్‌ ఛార్జీని రూ.15 ల‌కు పెంచుతూ ఆర్ట‌సీ రౌండప్‌ చేసింది. వీటితో పాటు 80 కి.మీ దూరానికి రూ.67 ఉన్న ఛార్జీని రూ.65 కు టీఎస్ ఆర్టీసీ త‌గ్గించింది. అంతే కాకుండా.. టోల్‌ప్లాజాల వద్ద ఆర్డినరీకి రూ.1, హైటెక్, ఏసీ బస్సులకు రూ.2 చోప్పున వసూలు చేయ‌నున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news