సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ఘటన తెలంగాణలో రాజకీయ వేడిని పుట్టించింది. నిన్న ఎల్లారెడ్డి పేటకు చెందిన బీజేవైఎం నేత టీఆర్ఎస్ పార్టీపై అనుచిత పోస్ట్ పెట్టడంతో ఘటన మొదలైంది. ఈ వివాదంతో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఈఘటనలో బీజేపీ కార్యకర్త ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
తాజాగా గాయపడ్డ బీజేపీ కార్యకర్తలను పరామర్శించేందుకు వెళ్తున్న బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎల్లారెడ్డి పేట వెళ్తున్న రాజాసింగ్ ను పోలీసుల అరెస్ట్ చేసి అల్వాల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఇదిలా ఉంటే మరోవైపు ఈ ఘటనపై టీఆర్ఎస్ నాయకులు కూడా ఫైర్ అవుతున్నారు. మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తీవ్ర స్థాయిలో బీజేపీని, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని విమర్శించారు. ఘటనకు బండి సంజయ్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మా కార్యకర్తల జోలికి వస్తే తీవ్ర పరిణామలు ఉంటాయని గంగుల హెచ్చరించారు. బుల్డోజర్లు వచ్చే లోపే బీజేపీని పాతాళంలోకి తొక్కేస్తామని రసమయి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.