ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రూ.2వేల నోటు కనిపించడమే భాగ్యమైపోయింది. ఏటీఎంలలో రూ.500, రూ.100 నోట్లు వస్తున్నాయి. కానీ రూ.2వేల నోటే రావడం లేదు.
ప్రధాని మోడీ రూ.1000, రూ.500 పాత నోట్లను రద్దు చేసినప్పుడు అందుబాటులోకి తెచ్చిన రూ.2వేల నోటుకు అప్పట్లో చిల్లర అస్సలే దొరికేది కాదు. ఆ తరువాత క్రమంగా పరిస్థితి మెరుగు పడింది. ఏటీఎంలలో కావల్సినన్ని డబ్బులు మనకు దొరుకుతున్నాయి. అయితే ఏటీఎంలలో ఎప్పుడో ఒకసారి డబ్బు లేని పరిస్థితులు కూడా మనకు ఎదురవుతున్నాయి లెండి. కానీ ఈ మధ్య కాలంలో ఆ సమస్యలు రావడం లేదు. అయితే ఏటీఎంలలో డబ్బు దొరకకపోవడం సమస్య ఇప్పుడు లేకున్నా.. మనకు రూ.2వేల నోటు కష్టాలు వచ్చి పడ్డాయి. అదేనండీ.. ఇప్పుడా నోటును చూద్దామంటే కనిపించడం లేదు.
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రూ.2వేల నోటు కనిపించడమే భాగ్యమైపోయింది. ఏటీఎంలలో రూ.500, రూ.100 నోట్లు వస్తున్నాయి. కానీ రూ.2వేల నోటే రావడం లేదు. అందుకు కారణం ఎన్నికలేనని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓటర్లకు డబ్బు పంచుతారు కదా.. అందుకే రూ.2వేల నోట్లు కనిపించడం లేదని, రాజకీయ పార్టీల నాయకులే ఆ నోట్లను ఎన్నికల కోసం ఇప్పటికే దాచి పెట్టారని వార్తలు వస్తున్నాయి.
మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పోలీసులు చేపడుతున్న చెకింగ్‌లలో పెద్ద ఎత్తున డబ్బు పట్టుబడుతుండగా, వాటిలో ఎక్కువగా రూ.2వేల నోట్లే ఉంటుండడం విశేషం. దీంతో రూ.2 వేల నోట్లను కచ్చితంగా ఎన్నికల కోసమే దాచి ఉంటారని అందరూ భావిస్తున్నారు. కాగా అటు ఆర్‌బీఐ కూడా ప్రస్తుతం మొత్తం అందుబాటులో ఉన్న కరెన్సీలో రూ.2వేల నోట్లు ఉండాల్సిన స్థాయిలో చెలామణీలో లేవని, అవి బ్లాక్ అయి ఉంటాయని చెబుతోంది. దీన్ని బట్టి చూస్తే.. ఎన్నికల కారణంగానే రూ.2వేల నోట్లు బ్లాక్ అయి ఉంటాయని మనకు తెలుస్తుంది. మరి ఇక ముందైనా రూ.2 వేల నోట్లు మనకు కావల్సినన్ని కనిపిస్తాయా, లేదా.. అనేది తెలియాలంటే.. ఎన్నికలు అయ్యే వరకు వేచి చూడాల్సిందే..!