RRR : థియేటర్ల వద్ద అభిమానుల హంగామా.. అర్ధరాత్రి సినిమా చూసిన చిరంజీవి..

-

దాదాపు మూడేళ్ల పాటు రాజమౌళి పడిన కష్టం, శ్రమను వెండితెరపైన మరి కొన్ని గంటల్లో ప్రేక్షకులు వెండితెరపైన చూడనున్నారు. ప్రజెంట్ ప్రపంచవ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ మేనియా ఉండగా, ఈ చిత్రం చూసేందుకు సగటు సినీ ప్రేక్షకుడే కాదు సెలబ్రిటీలు సైతం ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలోనే మూవీని రిలీజ్‌కు ముందు రోజే హైదరాబాద్‌లో బెన్ ఫిట్ షో‌ను తన కుటుంబ సభ్యులతో కలిసి చూసేశాడు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి. ప్రొడ్యూసర్ నాగవంశీ కూడా ఆయన ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి పిక్చర్ చూశాడు.

గతంలో ‘మగధీర’ చిత్రాన్ని విడుదలకు ముందు రోజు చూసి రాత్రంతా చిత్రం గురించి కుటుంబ సభ్యులతో చర్చించి ఆనందంలో మునిగిపోయిన చిరంజీవి.. ఈ సారి కూడా ఒక రోజు ముందే ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని వీక్షించాడు. హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాలో బెన్ ఫిట్ షోలు వేశారు. ఏఎంబీలోని నాలుగు స్క్రీన్లలో సెలబ్రిటీల కోసం స్పెషల్ షోలు వేయగా, అవి చూసేందుకు సెలబ్రిటీలు వచ్చారు. చిరంజీవి కుటుంబ సభ్యులు, నాగవంశీ, జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, కల్యాణ్ రామ్ తదితరులు వచ్చారు. దాంతో తమ అభిమాన నటులను చూసేందుకుగాను అభిమానులు పోటెత్తారు. థియేటర్ వద్ద అభిమానులు హంగామా చేస్తున్నారు.

‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ నెవర్ బిఫోర్ ఎక్స్ పీరియెన్స్ అని బెన్ ఫిట్ షో చూసిన ప్రేక్షకులు ఈ సందర్భంగా చెప్తు్న్నారు. భావోద్వేగాల సమాహారంగా రాజమౌళి తీసిన చిత్రంలో ప్రతీ సీన్ హైలైట్ అని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్- రామ్ చరణ్ తేజ్ లను వెండితెరపైన చూడటానికి రెండు కళ్లు చాలవని కొనియాడుతున్నారు. ఇక మరి కొన్ని గంటల్లో దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులందరూ చిత్రాన్ని చూడబోతున్నారు. సినిమా రిజల్ట్ డెఫినెట్‌గా ఎవరూ ఊహించని విధంగా ఉంటుందని, బొమ్మ దద్దరిల్లుతుందని ఈ సందర్భంగా మెగా, నందమూరి అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news