రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్..ఆ గడువు పొడిగింపు

-

దేశంలోని రేషన్‌ కార్డు దారులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. రేషన్‌ కార్డును ఆధార్‌ కార్డు తో అనుసంధానం చేసే గడువును ఈ ఏడాది జూన్‌ 30 వ తేదీ వరకు పెంచుతూ.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో జూన్‌ 30 వ తేదీ వరకు కార్డు దారులు రేషన్‌ సరఫరాలను పొందడంతో.. పాటు ఇతర పథకాలను, ప్రభుత్వ సౌకర్యాలను పొందుతారని ప్రభుత్వం స్పష్టం చేసింది.

అంతకు ముందు చివరి తేదీని మార్చి 31, 2022 గా నిర్ణయించారు. ప్రస్తుతం చివరి తేదీని సవరించడంతో.. 2022 జూన్‌ ‌ 30 వ తేదీ నాటికి లబ్ది దారులు తమ రేషన్‌ కార్డులను ఆధార్‌ లింక్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒకటే దేశం ఒకటే రేషన్‌ కార్డు పథకాన్ని కూడా ప్రారంభించింది. దీంతో ఒక ప్రాంతానికి చెందిన రేషన్‌ కార్డు దారులు దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వం అందించే రేషన్‌ సరుకులను పొందవచ్చును. వీటితో పాటు గా కేంద్రం అందించే అనేక పథకాలను రేషన్‌ కార్డు దారులు పొందుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news