ప్రపంచవ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం సినీ లవర్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. రామ్ చరణ్, తారక్ నటించిన ఈ మల్టీస్టారర్ మూవీపైన భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఇప్పటికే యూఎస్ ప్రీమియర్స్, బెన్ ఫిట్ షోలు చూసి అభిమానులు, సెలబ్రిటీలు సినిమా సక్సెస్ గురించి మాట్లాడుతున్నారు.
రాజమౌళి మస్టర్ స్టోరి టెల్లర్ అని, రికార్డులు తిరగరాస్తుందని చెప్తున్నారు. కాగా, బాలీవుడ్‌కు చెందిన నటుడు, స్వయం ప్రకటిత విమర్శకుడు కమల్ ఆర్.ఖాన్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా, దర్శకుడి గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన ట్వీట్స్ చేశాడు. దాంతో అవి చర్చనీయాంశమవుతున్నాయి.
దాదాపు నాలుగేళ్లు కష్టపడి రాజమౌళి కళా ఖండం తీశాడని అభిమానులు, సినీ ప్రేక్షకులు పేర్కొంటుండగా, ఈ చిత్రం తీసినందుకుగాను ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించాలని కమల్ ఆర్.ఖాన్ కామెంట్ చేశారు. ఇండియన్ సినిమా హిస్టరీలో ఇప్పటివరకు తీయనటువంటి చెత్త సినిమా ‘ఆర్ఆర్ఆర్’ అని, దీన్ని పొరపాటు అని తాను అనని, ఇదొక పెద్ద నేరమని పేర్కొన్నారు కమల్ ఆర్.ఖాన్. 600 కోట్ల రూపాయలతో ఇటువంటి చెత్త సినిమా తీసినందుకు రాజమౌళిని ఆరు నెలల పాటు జైల్లో పెట్టాలని కమల్ ఆర్. ఖాన్ ట్వీట్ చేశాడు.
ఇక కమల్ ఆర్.ఖాన్ ట్వీట్స్ పైన నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. కమల్ ఆర్.ఖాన్ కావాలనే దక్షిణాది సినిమాపై అక్కసు వెళ్ల గక్కుకుతున్నారని విమర్శిస్తున్నారు. కావాలనే ‘ఆర్ఆర్ఆర్’ డైరెక్టర్ రాజమౌళిపై పలు ఆరోపణలు చేశారని, సినిమా ఇంకా విడుదల కాకముందే విమర్శకుడినని చెప్పుకుంటూ సిల్లీ రివ్యూస్ ఇస్తున్నాడని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ముంబైలో ఉండి అలా సౌత్ ఫిల్మ్స్ పైన కమల్ ఆర్.ఖాన్.. విమర్శలు చేస్తున్నాడని, అది సరికాదని మరి కొందరు సూచిస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ అట్టర్ ప్లాప్ అని, ఆ సినిమాను ఆమిర్ ఖాన్ ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ చిత్రంతో కంపేర్ చేశాదని కామెంట్ చేశాడు.
I can’t call it mistake but I will call it biggest crime. Director #Rajamouli should be jailed for minimum 6 months for making this crap film #RRR with ₹600Cr budget.
— KRK (@kamaalrkhan) March 24, 2022