RRR : రామ్ చరణ్‌కే ప్రయారిటీ ఇచ్చారు.. రాజమౌళిపై మండిపడుతున్న తారక్ ఫ్యాన్స్..

-

టాలీవుడ్ జక్కన్న ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. చిత్రాన్ని థియేటర్లో చూసిన అభిమానులు, సినీ ప్రేక్షకులు చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. మాస్టర్ స్టోరి టెల్లర్ రాజమౌళి మూవీని చాలా బాగా తీశారని అంటున్నారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మాస్టర్ పీస్ అని ట్వీట్ చేశారు.

ఇదంతా ఒక వైపు కాగా, మరో వైపున కొంత మంది తారక్ అభిమానులు మాత్రం తమ హీరోకు సరైన ప్రయారిటీ ఇవ్వలేదని కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలో 90 శాతం రామ్ చరణ్ తేజ్ ఉన్నాడని, కేవలం 10 శాతమే జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడని అంటున్నారు.

తారక్ అభిమానులమైన తాము రాజమౌళిపైన చాలా ఆశలు పెట్టుకున్నామని, కానీ, చాలా డిసప్పాయింట్ చేశారని అంటున్నారు. థియేటర్‌లో శుక్రవారం పిక్చర్ చూసిన కొందరు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు రాజమౌళిపై మండిపడుతున్నారు. అనవసరంగా తమ అభిమాన కథా నాయకుడు నాలుగేళ్ల టైం ‘ఆర్ఆర్ఆర్’ కోసం కేటాయించాడని అంటున్నారు. అయితే, ఇది జూనియర్ ఎన్టీఆర్ కొందరు అభిమానుల అభిప్రాయం మాత్రమే. జూనియర్ ఎన్టీఆర్ గురువారం నైట్ బెన్ ఫిట్ షో చూసి విక్టరీ సింబల్ చూపించి హ్యాపీగా ఉన్నారు.

తన ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి ఏఎంబీ సినిమాస్‌లో తారక్ సినిమా చూసి ఇంటికెళ్లాడు. ఈ సందర్భంగా బయటకు వెళ్తున్న క్రమంలో మీడియా వారికి విక్టరీ సింబల్ చూపించి నమస్కారాలు పెట్టాడు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో ‘కొమురం భీం’ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ కనిపించగా, అల్లూరి సీతారామరాజు పాత్రను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పోషించాడు. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, ఆలియా భట్, సీనియర్ హీరోయిన్ శ్రియా సరణ్, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news