బాలయ్య ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన అల్లరోడు..!

-

ఒకప్పుడు కామెడీకి కేరాఫ్ అడ్రెస్ గా ఉన్న అల్లరి నరేష్ ఈమధ్య పూర్తిగా వెనుకపడిపోయాడు. కొద్దిపాటి గ్యాప్ తో మళ్లీ వరుస ఛాన్సులు అందుకుంటున్నాడు అల్లరోడు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ మహర్షి సినిమాలో అల్లరి నరేష్ ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో పాటుగా నరేష్ సోలో హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు పి.వి.గిరి డైరక్షన్ లో నరేష్ హీరోగా వస్తున్న సినిమా బంగారు బుల్లోడు.

నట సింహం నందమూరి బాలకృష్ణ ఆల్రెడీ ఇదే టైటిల్ తో సినిమా చేశారు. ఇప్పుడు అల్లరి నరేష్ అదే టైటిల్ తో సినిమా చేస్తున్నాడు. నందిని నర్సింగ్ హోం సినిమాతో దర్శకుడిగా పరిచయమైన గిరి రెండో ప్రయత్నంగా చేస్తున్న సినిమా బంగారు బుల్లోడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఉగాది సందర్భంగా ఈరోజు రిలీజ్ చేశారు. మెడచుట్టూ బంగారు గెలుసుతో అల్లరి నరేష్ ఇచ్చిన స్టిల్ అదిరింది. వెనుకాల కూడా బ్యాంక్ లాకర్లతో కూడిన ఇమేజ్ కనిపిస్తుంది. సో బంగారు బుల్లోడు సినిమా మొత్తం ఆధ్యంతం కామెడీ పండించేలా ఉన్నాడనిపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news